బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నందు – రెమ్యునరేషన్ పెంపుపై ఆసక్తి

విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రీ నందు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నటుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఇప్పటికే 100% Love, సవారి, దండోరా, సైక్ సిద్ధార్థ్, అగ్లీ స్టోరీ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన నందు, ప్రస్తుతం కాసు, మగాళ్లు జిందాబాద్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్స్ నుంచి వినోదాత్మక చిత్రాల వరకు విభిన్న జానర్లను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

వరుస ప్రాజెక్టులతో బిజీగా మారుతున్న నందు తన రెమ్యునరేషన్‌ను పెంచుతున్నారనే ప్రచారం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రాబోయే సినిమాలతో నందు తన కెరీర్‌లో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.

Related Articles

Latest Articles