ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ రోల్.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా అభిమానుల్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్స్ కి ఎండ్ కార్డ్ పెట్టారు.
చిరంజీవి స్వయంగా రాబోయే చిత్రంలో తన కొడుకు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవలి ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చారు.

“నా భార్య సురేఖా ఎప్పుడూ మా ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని కోరుకుంటుంది. ఈ అవకాశాన్ని మనం ఈ సారి వదిలివేస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. నేను ఎస్.ఎస్.రాజమౌలితో కూడా రామ్ చరణ్ డేట్స్ గురించి మాట్లాడాను. ఇది నాకు ఎందుకు ముఖ్యమో ఆయనకు వివరించాను, ”అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. అందుకే డేట్స్ క్లాష్ కాకుండా రామ్ చరణ్ కోసం ప్లాన్ చేంజ్ చేసుకునే వీలును కల్పించాలని జక్కన్నకు మెగాస్టార్ ఫోన్ చేసి చెప్పారు. అందుకు రాజమౌళి కూడా పెద్దగా ఆలోచించకుండా లుక్ ఒక్కటి రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించినట్లు సమాచారం.