‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ పాటను విడుదల చేసిన డా. CH ప్రీతిరెడ్డి

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటను మల్లారెడ్డివిశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి రిలీజ్ చేశారు.

ఈ పాటను సమీరా భరద్వాజ్ ఆలపించారు. రాంబాబు గోసాల సాహిత్యం, సునాద్ గౌతమ్ బాణీ ఈ పాటను ప్రత్యేకంగా మార్చింది. ఇక ఇందులోని విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ పాటను మరింత అందంగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం..

డా. సీహెచ్. ప్రీతిరెడ్డి మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి ఫ్యామిలీ ఎమోషన్స్, గ్రామీణ నేపథ్యంలో వచ్చే చిత్రాలు, అవి ఇచ్చే సంతోషం అంతా ఇంతా కాదు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘మా సినిమాలోని పాటను రిలీజ్ చేసిన ప్రీతి రెడ్డి గారికి థాంక్స్. ఆమెతో మా సినిమాకి ఫుల్ పాజిటివిటీ వచ్చినట్టు అనిపిస్తోంది. మా మూవీ సక్సెస్ మీట్‌కి కూడా ప్రతీ రెడ్డి గారు వస్తారు. మా సినిమా, ఇందులోని పాటలు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. ‘ఏరై పారే హృదయం’ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ సినిమాలోని ‘ఏరై పారే హృదయం’ పాటను ప్రీతిరెడ్డి గారు రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే సందర్భంగా పాటను విడుదల చేయడం సంతోషంగా అనిపిస్తోంది’ అని అన్నారు.

KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Latest Articles