
ఓ అనుకోని పరిచయం.. ఓ మిస్టరీ మహిళ.. బయటకు రాని రహస్యం. ఓ సాధారణ పరిచయం భయంకరమైన మిస్టరీగా మారితే ఏం జరుగుతుంది? ఆకర్షణ వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రొమాన్స్, మిస్టరీ, అతీంద్రియ భయానక అంశాల కలయికతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఇమ్మోర్టల్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డెబ్యూ డైరెక్టర్ మరియప్పన్ చిన్నా రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 30, 2026 నుంచి సోనీ లివ్లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు.
ప్రస్తుత చెన్నై నేపథ్యంలో తెరకెక్కిన ‘ఇమ్మోర్టల్’ కథ విషయానికి వస్తే ఇది చెన్నై నేపథ్యంలతో తెరకెక్కింది. ఇందులో మ్యాగి (జి.వి. ప్రకాశ్ కుమార్) ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంటాడు. తక్కువ అద్దెకు ఓ గది కోసం వెతుకుతున్న అతడికి సింధు (కయాదు లోహర్) పరిచయమవుతుంది. ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్లోని గదిని ఊహించని తక్కువ అద్దెకు ఇస్తానని ఆమె చెబుతుంది. తక్కువ అద్దెకు మంచి గది దొరకడంతో మ్యాగి అదృష్టంగా భావిస్తాడు. అయితే ఆ తర్వాత చోటుచేసుకునే వింత సంఘటనలు అతడిని కలవరపెడతాయి. క్రమంగా సింధు ప్రపంచంలోకి అడుగుపెట్టిన మ్యాగికి.. తాను ఊహించిన దానికంటే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఓ మిస్టరీ ఎదురవుతుంది. అసలు సింధు ఎవరు? ఆమె చుట్టూ ఉన్న రహస్యాలేంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సందర్భంగా జి.వి. ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. “మ్యాగి పాత్ర ప్రతి ఒక్కరికీ సులభంగా కనెక్ట్ అవుతుంది. అతను అసలు ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఈ పాత్రలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. ప్రేక్షకులతో పాటే మ్యాగి కూడా ఒక్కో విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు. అతని ప్రయాణంలో ఆసక్తి, భయం, తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతాయి. ఇవన్నీ నా పాత్రను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ‘ఇమ్మోర్టల్’ సినిమాను ఇప్పుడు సోనీ లివ్లో ప్రేక్షకులు చూడబోతుందటం ఆనందంగా ఉంది. ఈ సినిమా వెనుక ఉన్న మిస్టరీని ప్రేక్షకులు స్వయంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
జి.వి. ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్లతో పాటు టి.ఎం. కార్తీక్, కుమార్ నటరాజన్, లొల్లు సభ మారన్, ఆదిత్య కదిర్, అర్షు మహర్జన్, పెమా త్సామ్చో, సునీత శ్రేష్ఠైన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
‘ఇమ్మోర్టల్’ చిత్రం అక్టోబర్ 30, 2026 నుంచి సోనీ లివ్లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది.


