నార్కోటిక్స్ బ్యూరో వలలో పెద్ద చేపపడబోతుందా? ఆ ఒక్కడిని విచారిస్తే చాలా చిన్న చేపల పేర్లు బయటకి వస్తాయా? ఒకరు విచారణకి హాజరవుతుంటేనే బాలీవుడ్ ఎందుకు వణుకుతుంది. కష్టం వస్తే అందరూ కాపాడు దేవుడా అని జపం చేస్తారు, ఇప్పుడు కష్టంలో నెట్టకు దేవుడా అనుకుంటూ బాలీవుడ్ బిగ్గీస్ అతని పేరునే తలుచుకుంటున్నారు. ఎంటైర్ బాలీవుడ్ ని 24 గంటలుగా నిద్రలేకుండా చేస్తున్న ఆ ఒక్కడు మధు మంతెన. అసలు ఎవరు ఈ మధు మంతెన.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు కాస్త ఎంటైర్ బాలీవుడ్ ని వణికించే డ్రగ్ స్కాండల్ వరకూ వెళ్ళింది. నిన్న మొన్నటి వరకూ ఈ డ్రగ్ స్కాండల్ లో ఇద్దరు ముగ్గురు స్టార్ల పేర్లు బయటకి వచ్చినా ఈరోజు బయట వచ్చిన పేరు మాత్రం హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఏ క్షణంలో ఆ వ్యక్తి ఎవరి పేరుని బయట పెడతాడో అనే భయం కలిగుతోంది. అతన్ని ఏం అడుగుతారు, ఎలా ప్రశ్నించబోతున్నారు అంటూ బాలీవుడ్ బిగ్గిస్ టెన్షన్ పడుతున్నారు. ఇంతమంది భయపడడానికి కారణం ఒకే ఒక్కడు. స్టార్ హీరోస్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ ఒక్కడి పేరే… “మధు వర్మ మంతెన”. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహ ఈ పేరుని బయట పెట్టింది. అంతమందిని భయపెడుతున్న ఈ మధు మంతెన ఎవరు? అతని బ్యాక్ డ్రాప్ ఏంటి? అతను పట్టుబడితే సారీ జస్ట్ నోరు విప్పితే ఈ డ్రగ్ స్కాండల్ లో బయట పడే వారి లిస్ట్ ఎంత ఉంటుంది. ఈ విషయాలని కవర్ చేస్తూ మీకోసం స్పెషల్ ఆర్టికల్…
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి దెగ్గర బంధువైన మధు మంతెన అంటే బాలీవుడ్ వర్గాలకి చాలా క్లోజ్. ప్రొడ్యూసర్ కమ్ టాలెంట్ మానేజ్మెంట్ KWANని మైంటైన్ చేసే మధు 2003లో కార్తీక్ సినిమాతో ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ మూవీ అడ్రెస్ లేకపోవడంతో బాలీవుడ్ కి మకాం మార్చిన మధు మంతెన, 2008లో ఆమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఘజిని సినిమాకి గీత ఆర్ట్స్ తో పాటు కో-ప్రొడ్యూస్ చేశాడు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో మధు మంతెన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2010లో రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాని కూడా మధు మంతెననే ప్రొడ్యూస్ చేశాడు. 2011లో విక్రమాదిత్య, అనురాగ్ కశ్యప్ లతో కలిసి ఫాంథమ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 2013 నుంచి 2019 వరకూ 18 సినిమాలని నిర్మించిన ఈ సంస్థ నుంచి లుటేరా, క్వీన్, NH10, ఉడ్తా పంజాబ్, రమణ్ రాఘవ్, మన్మార్జియాన్, సూపర్ 30 లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో దాదాపు అన్నీ స్టార్స్ తో తీసిన సినిమాలే కావడం విశేషం. అయితే మధు మంతెన పేరు డ్రగ్ స్కాండల్ లో వినిపించడంతో అందరి ద్రుష్టి ఉడ్తా పంజాబ్ పైనే పడింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో పంజాబ్ స్టేట్ డ్రగ్స్ లో ఎలా మునిగిపోయింది, అక్కడికి అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఎవరికీ తెలియకుండా వాటిని ఎలా స్మగుల్ చేస్తున్నారు? డ్రగ్స్ వాడిన వారి పరిస్థితి ఏంటి అనే విషయాలని కళ్లకి కట్టినట్లు చూపించారు. డ్రగ్స్ పై వచ్చిన మోస్ట్ అతేంటిక్ సినిమా ఈ ఉడ్తా పంజాబ్ అంటే నమ్మగలరా. డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయి కాబట్టే మధు మంతెన ఇలాంటి సినిమాని ఇంత పర్ఫెక్ట్ గా తీశాడు అనే వాళ్లు కూడా ఉన్నారు.
కో ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకుంటున్న టైంలోనే క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీతో కలిసి 2012లో KWANని ప్రారంభించాడు. బాలీవుడ్ టాలెంట్ అంతా ఒక గొడుగు కిందకి రావడం మొదలయ్యింది ఇక్కడి నుంచే. యంగ్ టాలెంట్ ని, ఇండస్ట్రీ లోకి రావాలనుకునే యాస్పిరెంట్స్ కి అవకాశాలు కలిపిస్తూ ఏర్పాటు చేసిన ఈ KWAN ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మించిన ప్రతి సినిమాకి యాక్టర్స్ ని ఇచ్చింది. ఇన్ ఫాక్ట్ బాలీవుడ్ లో వచ్చే ఎన్నో కొత్త సినిమాలకి ఆర్టిస్టులని సప్లై చేస్తూ KWAN ఎదిగింది. ఈ మొత్తం సినారియోని ఒకసారి గమనిస్తే, టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం, సినిమాలు చేయడం, వచ్చే డబ్బులతో మళ్లీ సినిమాలు చేయడం, ఆ సినిమాల కోసం కొత్త టాలెంట్ ని ఇంట్రడ్యూస్ చేయడం. ఇదో సర్క్యూలర్ చైన్ సిస్టమ్… బాలీవుడ్ సినీ ప్రపంచం అక్కడక్కడే తిరిగేలా చేసే సర్క్యూలర్ సిస్టమ్. ఈ సిస్టమ్ ని ఏర్పాటు చేసిన మాస్టర్ మైండ్ మధు మంతెన. హైదరాబాద్ లో పుట్టి బాలీవుడ్ ని శాసించే వారిలో ఒకడిగా ఎదిగిన మధు మంతెన, ఇప్పుడు డ్రగ్ స్కాండల్ లో నార్కోటిక్స్ బ్యూరో మెట్లు ఎక్కాడు. జయ సాహతో పాటు మధు మంతెనని కూర్చోబెట్టి నార్కోటిక్స్ అధికారులు అతన్ని విచారించనున్నారు. మధు మంతెనని నార్కోటిక్స్ అరెస్ట్ చేస్తే పెద్ద చేప వలలో పడినట్లే. ఇతను నోరు తెరిస్తే వచ్చే లిస్ట్ బాలీవుడ్ నే కుదిపేసే స్థాయిలో ఉంటుంది. Master Mind Behind The KWAN, Man Behind The Bars అవుతాడా? అతను వెళ్తూ వెళ్తూ ఎవరినైనా తీసుకోని వెళ్తాడా? KWAN సౌత్ ఇండియా పార్టనర్ అయిన రానా దగ్గుబాటి పేరు కూడా నార్కోటిక్స్ లిస్ట్ లో చేరుతుందా? Master Mind Behind The KWAN, Man Behind The Bars అవుతాడా? అతను వెళ్తూ వెళ్తూ ఎవరినైనా తీసుకోని వెళ్తాడా అనేది తెలియాలి తెలియాలి అంటే డ్రగ్ స్కాండల్ అప్డేట్స్ ని ఫాలో అవ్వాల్సిందే.