
వారాహి ఆర్ట్స్ బ్యానర్ మీద బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో లక్ష్మణ్ టేకుమూడి , రాధికా జోషి , సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. ఈ సినిమాలో సురేష్ గురు , పృధ్వీ రాజ్ , సత్య ప్రకాష్ , జబర్దస్త్ నూకరాజు , జగదీశ్వరి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను సాయి రాజేష్ రిలీజ్ చేశారు.
‘కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నువ్వు నాకు ఎదురైన ప్రతీసారి కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయి చూసేది.. నా చివరి శ్వాస వరకు.. నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు.. నీదే.. బతికుంటే నీ ప్రేమతో.. ఊపిరి ఆగితే నీ జ్ఞాపకాలతో.. ప్రతీ ప్రేమ కథ ముగింపు వరకు వెళ్లలేకపోవచ్చు.. కానీ నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా’ అంటూ సాగిన ఈ మూవీ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యూత్ ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రానున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ సినిమాకి అరవింద్. బి కెమెరామెన్‌గా, ఎస్. సుహాస్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్లను ప్రకటించనున్నారు.
నటీనటులు : లక్ష్మణ్ టేకుమూడి , రాధికా జోషి , సుప్రియా చవాన్, సురేష్ గురు , పృధ్వీ రాజ్ , సత్య ప్రకాష్ , జబర్దస్త్ నూకరాజు , జగదీశ్వరి తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : వారాహి ఆర్ట్స్
సమర్పణ : బొబ్బాస్ ప్రజెంట్స్
దర్శకుడు : GD నరసింహ
రచయితలు : లక్ష్మణ్ టేకుమూడి, అజయ్ యార్లగడ్డ
కెమెరామెన్ : అరవింద్ బి
సంగీతం : ఎస్ సుహాస్
పీఆర్వో: సాయి సతీష్


