
ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది.
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో తొలిసారిగా ‘ప్లే చేయగలిగే ట్రైలర్’గా అందుబాటులోకి తీసుకొచ్చారు. STREET FIGHTER Combo Challenge ద్వారా అభిమానులు ట్రైలర్‌ను చూస్తూనే గేమ్ ఆడే అవకాశం కల్పించారు. ‘స్ట్రీట్ ఫైటర్’ అక్టోబర్ 16, 2026న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.


