
ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో వస్తున్న మిస్సింగ్ మేఘన సినిమా లోని 2వ సాంగ్ ను లాంచ్ చేశారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు…అలాగే లిరిక్స్ , మ్యూజిక్ బాగున్నాయి.. సినిమా కూడా హిట్ అవుతుంది అని అభినందించారు దిల్ రాజు.
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారి చేతుల మీదుగా జరగగా … తరువాత సినిమా నుంచి ఫస్ట్”సింగిల్ పిల్ల పిల్ల పిల్ల లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. అలాగే 2 వ పాట ను నిర్మాత దిల్ రాజు గారు రిలీజ్ చేశారు…శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు.
దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ… “ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాలు ఇచ్చి..పెద్ద ..పెద్ద దర్శకులను చేసిన దిల్ రాజు గారి చేతుల మీదగా మా సినిమాలో 2nd లిరికల్ రిలీజ్ చేయడం హ్యాపీ ఉంది. మేము రిలీజ్ చేసిన సాంగ్ కు , టీజర్ కు ఆడియన్స్ నుండి ..మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి మంచి అప్లాజ్ వస్తుంది… సినిమా విషయానికి వస్తే మంచి ఎమోషనల్ థ్రిల్లర్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా చేయడం జరిగింది. మా సాంగ్స్, టీజర్ ఎంత బాగున్నాయో..సినిమా అంత కంటే బాగుంటుంది అని తెలియజేశారు” అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్. ఆర్. ధృవన్ మాట్లాడుతూ… “నేను సంగీతం అందించిన మిస్సింగ్ మేఘన లోని సాంగ్ ను దిల్ రాజు లాంచ్ చేయడం చాలా ..చాలా హ్యాపీగా ఉంది..రాజు గారికి మ్యూజిక్ లో మంచి టెస్ట్ ఉంది .అందుకే ఆయన సినిమాలోని పాటలు చాట్ బస్టర్స్ అవుతున్నాయి… అటువంటి రాజు గారు మా పాట విని చాలా బాగుంది అనడం ..మాకు మంచి బూస్ట్ నిచ్చింది.నేనే స్వరపరచి , సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు గారు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్” అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ… “ఎంతో మంది కి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది…ఆయన హార్ట్ ఫుల్ గా పాట బాగుంది.. సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు…ఆయన అన్నట్టే సినిమా కూడా వచ్చింది..అలాగే ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను” అన్నారు.
నటీనటులు : రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య, గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు
టెక్నీకల్ టీం :
ప్రొడ్యూసర్: పంచుమర్తి నరేష్ బాబు
కో-ప్రొడ్యూసర్: దివెళా శ్రీనివాస్ రావ్
బ్యానర్ నేమ్స్: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో
దర్శకత్వం: వాచస్పతి
కథ & స్క్రీన్ప్లే: వనరాజ్
సంభాషణలు: వెంకట్ బద్దిగం
సంగీతం: ఆర్.ఆర్.ధృవన్
ఛాయాగ్రహణం: శామ్. కె. నాయుడు
ఎడిటింగ్: బసవా
కొరియోగ్రాఫర్: జేడీ, ఈశ్వర్ పెంటి
ఫైట్స్: రామకృష్ణ, స్టంట్ శంకర్
లిరిక్స్: ఆర్.ఆర్. ధృవన్, అలరాజు
అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీధర్ పరిగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్:
మద్దినేని హరి కృష్ణ
కిషోర్ తోకల
పిఆర్వో: సోమిశెట్టి నాగేశ్వర రావ్ (SNR), తిరుమలశెట్టి వెంకటేష్


