నాగ చైతన్య హీరోగా సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానరుపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం మజిలీ. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి సెన్సిబుల్ సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఆడియెన్స్‌కి థాంక్స్ తెలపడానికి హైదరాబాద్ పార్క్‌హాయాత్ హోటల్ లోగ్రాండ్ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ – ”అనిల్‌కి, కొరటాల శివగారికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా సక్సెస్ అనేది దర్శకుడు విజన్‌తో స్టార్ట్ అవుతుంది. నిర్మాతలు ఆ స్క్రిప్ట్‌ని సపోర్ట్ చేయాలి. నటీనటులు కథ విని నటించడానికి అంగీకరించాలి. మంచి టెక్నీషియన్స్ యాడ్ కావాలి. చివరికి ట్రైలర్లు, టీజర్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొని పంపిణీ చేస్తారు. అందరూ కలిసి కుటుంబంలా కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. శివ ఎప్పటికీ మర్చిపోలేని సక్సెస్ ఇచ్చాడు. నా లైఫ్లో క్రూషియల్ సమయంలో నాకు సక్సెస్ ఇచ్చాడు శివ. సక్సెస్, ఫెయిల్యూర్లు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ సక్సెస్ నాకు ఎప్పుడూ స్పెషల్. నాకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. సాహు, నన్ను ఎంకరేజ్ చేశారు. ఆర్టిస్టులు అందరితో పనిచేసేటప్పుడు నేను ఏదో నేర్చుకుంటూ ఉంటాను. సుబ్బరాజుతో నాకు చాలా మంచి సీన్ ఉంది. ఎమోషనల్ సీన్ అది. అది సినిమాలో లేదు. తమన్ లాస్ట్ మినిట్‌లో సినిమాను యాక్సెప్ట్ చేసి పెద్ద లైఫ్ ఇచ్చాడు. విష్ణు, ప్రవీణ్, సాయి సురేష్, లిరిసిస్ట్, కొరియోగ్రాఫర్స్ అందరికీ ధన్యవాదాలు. దివ్యాన్ష చాలా బాగా నటించింది” అన్నారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – ”సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. ఫస్ట్ కాపీని సిద్ధం చేసే క్రమంలో నా శక్తి మేరకు చేశాను. ఈ సినిమాను నా కంటే ఎక్కువ మోసింది. నా హీరో హీరోయిన్లు, నటీనటులు, టెక్నిషియన్సే. అందరూ వారి వారి బాధ్యతలను సమానంగా తీసుకున్నారు. మన కష్టాన్ని, హ్యాపీ షేర్ చేసుకోవడం కంటే గొప్ప విషయం ఉండదని ఈ సినిమాతో అర్థమైంది. కథను రాసుకున్న తర్వాత సినిమా తీసి నేనెంతగా ఇష్టపడ్డాను .. ప్రేక్షకులు కూడా అంతే ఇష్టపడితే చాలు అనుకునేవాడిని. నాకు గ్రాస్, షేర్ కలెక్షన్స్ గురించి తెలియవు. 15 రోజుల నుండి చాలా కొత్త విషయాలను చూస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఫోన్స్ చేసి అప్రిషియేట్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య విషయంలో ఈ నంబర్స్ వర్కవుట్ అవడం చాలా ఆనందంగా ఉంది. నిన్నుకోరి తర్వాత నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయినా నేను చైతన్యలో ఉన్న ఆర్టిస్ట్ నమ్మి ఈ సినిమా చేశాను. మంచి కంటెంట్ పడితే తను ఎంత బాగా చేయగలుగుతాడనేది భవిష్యత్‌లో తెలుస్తుంది. ఆయనలో ఎంత ఎక్స్‌ట్రార్డినరీ యాక్టర్ ఉన్నాడో తెలుస్తుంది. ఇక సమంతగారి గురించి చెప్పాలంటే .. షూటింగ్ చేసే ప్రాసెస్‌లో నేను ఆమెకు అభిమానిగా మారిపోయాను. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె పెర్ఫామెన్స్ చూసి ఇంకా బాగా రాసుండొచ్చు కదా అనిపించింది. చై, సామ్ ఈ సినిమాకు ఎంత లైఫ్ ఇచ్చారో మాటల్లో చెప్పలేను. అలాగే రావు రమేష్, పోసానిగారు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. మంచి టీం సెట్ అయ్యింది. గోపీసుందర్‌గారు అద్భుతమైన పాటల్ని ఇస్తే.. తమన్‌గారు అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చారు. తమన్ ఆర్ ఆర్‌తో సినిమాకు ప్రాణం పోశాడు. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాకు సమయం పెరిగే కొద్ది విలువ పెరుగుతుంది” అన్నారు.
దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ – ”చైతన్య, సామ్, హరీష్‌గారికి, సాహుగారికి, తమన్‌గారు సహా అందరికీ థాంక్స్” అన్నారు.
అనీల్ రావిపూడి మాట్లాడుతూ – ”మజిలీ యూనిట్‌కు బెస్ట్ విషెస్. శివ నిర్వాణ చూసిన ప్రపంచానికి అందరూ వెళ్లినట్లు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ప్రేక్షకుల్ని కూడా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లారు. పూర్ణ క్యారెక్టర్ చేసిన చైతన్యగారి గురిచి ముందుగా చెప్పాలి. ఆయనతో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ కుదరలేదు. తను సినిమా సినిమాకు తన పంథా మార్చుకోకుండా షైన్ అవుతూ వచ్చారు. కంప్లీట్ యాక్టర్‌గా చైతన్య కనపడ్డారు. అలాగే సమంతగారు, దివ్యాంశగారు అద్భుతంగా వారి పాత్రలను క్యారీ చేశారు. సాహు, హరీష్‌గారితో కూడా సినిమా చేయాలనుకుంటున్నాను. మంచి నిర్మాతలు. అందరికీ కంగ్రాట్స్” అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ – ”నేను ‘భరత్ అనే నేను’ సినిమాను చేస్తున్నప్పుడు దానయ్యగారి ఆఫీసులో ఉండగా, శివ నిర్వాణను కోన వెంకట్ పరిచయం చేశారు. అప్పుడు నాకు శివ ‘నిన్ను కోరి’ కథ చెప్తే దానయ్యగారితో చాలా మంచి సినిమా సార్ అని అన్నా. సినిమా అయ్యాక నేను శివ నిర్వాణతో చాలా బాగా చేశారు అని చెప్పా. ఆయన తొలి సినిమా నేల మీద ఉందనిపించింది. నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ’మజిలీ’టైటిల్ కూడా నాకు చాలా నచ్చింది. ప్రతి పాత్రనూ ఆయన ఎంపిక చేసుకున్న విధానం, ఆ సీన్లను రాసుకున్న తీరు… వంటివన్నీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. చాలా డీటైల్డ్ వర్క్ చేశారు శివ. అతని లైఫ్‌లో ఏదో చిన్న పెయిన్ ఉంది. ఎవరైనా అమ్మాయి ఒకవేళ అతన్ని వదిలి వెళ్లిపోయినా చాలా ఆనందించాల్సిన విషయమే. అందువల్లే ఇంత మంచి కథలు వస్తున్నాయి. పోసానిగారు, రావు రమేష్ గారు లాంటివాళ్లు ఉండటం ఇండస్ట్రీకి అద ష్టం. చైతన్యగారిని చూసినప్పుడు నాకు ఎప్పుడూ హానెస్ట్‌గా అనిపిస్తారు. ఆయన బలాలు, బలహీనతలూ ఆయనకు తెలుసు. అంత నిజాయతీగా ఉంటారు కాబట్టే ఆయన పెర్ఫార్మెన్స్ లు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో పూర్ణను చూస్తుంటే ఆ పాత్ర వైజాగ్‌లో ఉందేమోనని అనిపిస్తుంది. మెయిల్ లీగ్‌లో ఉన్నారాయన. సమంతగారితో నేను పనిచేశాను. ఆమె గ్రేట్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో చైతూ, సమంత మధ్య కెమిస్ట్రీ ఎక్స్‌ట్రార్డినరీ. సినిమాలో ఆవిడ చైతన్యను ఎలా చూసుకున్నారో, బయట కూడా ఆమె అలాగే చూసుకుంటున్నారని అనుకుంటున్నాను. సుబ్బరాజు బాగా చేశాడు. తమన్ రీరికార్డింగ్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. నిర్మాతలు చాలా యంగ్‌గా ఉన్నారు. వాళ్లకి మరిన్ని సక్సెస్‌లు రావాలి. దివ్యాన్ష చాలా బాగా చేసింది. యూనిట్ మొత్తం చాలా బాగా చేసింది” అన్నారు.
నటుడు రావు రమేష్ మాట్లాడుతూ – ”ఒక సినిమాను చేసేటప్పుడు హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంటూ.. కనపడ్డ వాళ్లందరికీ సినిమా హిట్ అవుతుందని చెప్పడమే కాకుండా భవిష్యత్‌లో ఓ రెఫరెన్స్‌లా ఇలాంటి సినిమాలు తీయాలనేలా కల్ట్ మూవీ అవుతుందని అనుకున్నాక.. సినిమా రిలీజ్ తర్వాత మనం అనుకున్న అంచనాలు నిజమైతే ఉండే కిక్కేవేరు. అనుకోకుండా సినిమా హిట్ అయిపోయిందా? అని అనుకోకుండా ఊహించినంతగానే పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ థాంక్స్. ఇలాంటి సినిమాలో హీరో హీరోయిన్‌తో పాటు ప్రతి పాత్రకు గొప్ప పేరు వచ్చింది. అంత గొప్పగా శివ నిర్వాణగారు స్క్రిప్ట్ రాశారు. ప్రతి పాత్ర బావుందని నిజాయతీగా చెప్పుకుంటున్నారు. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. అద్భుతమైన పాటలు ఇచ్చిన గోపీసుందర్‌గారికి, పాటలు రాసిన రచయితలకు థాంక్స్. తమన్ రీరికార్డింగ్ సినిమా రేంజ్‌లో మరో లెవల్‌కు తీసుకెళ్లింది. పర్టిక్యులర్‌గా ఆర్ ఆర్‌తో సన్నివేశాలకు బలాన్ని చేకూర్చారు. అలాగే విష్ణుశర్మగారు ఎక్సలెంట్ విజువల్స్ అందించారు. క్యాప్చర్ చేసిన విధానం, లైటింగ్ అంతగా కొత్తగా ఉంది. సమ్మర్ బూస్టర్‌గా సినిమా పేరు తెచ్చుకుంది. అన్నం చాలా గొప్పది. ఎందుకంటే ఎన్ని ఏళ్లయినా మనకు అన్నం ముందు కూర్చునేటప్పుడు విసుగురాదు. అలాంటి అన్నంలాంటి గొప్ప సినిమా ఇది. శివనిర్వాణగారికి థాంక్స్. నాగచైతన్య ఫస్టాఫ్‌ను క్యారీ చేసిన తీరు టైటానిక్ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇక సెకండాఫ్‌లో చైతన్యగారు, సమంతగారు అద్భుతంగా చేశారు. మా అందరికీ గుర్తుండిపోయే అద్భుతమైన జర్నీయే ఈ సినిమా. ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన సాహుగారపాటి, హరీష్ పెద్దిగారికి థాంక్స్” అన్నారు.
నటుడు సుబ్బరాజు మాట్లాడుతూ – ”కళ్లు చెమర్చి చాలా కాలమైంది. ఈ సినిమా చూసినప్పుడు కళ్లు చెమ్మగిల్లాయి. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణకు థాంక్స్. నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందమేస్తుంది. ఫెంటాస్టిక్ ఫీలింగ్‌ను కలిగించిన చిత్రం నిర్మాతలు సాహు, హరీష్‌గారికి థాంక్స్” అన్నారు.
నటుడు పోసాని క ష్ణమురళి మాట్లాడుతూ – ”మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు శివ, నిర్మాతలు సాహు, హరీష్‌గారికి థాంక్స్. పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ఇలాంటి ఫంక్షన్స్‌కి అతిథిగా వెళ్లేవాడిని. అప్పట్లో సక్సెస్ అయిన సినిమాలకు షీల్డ్స్ ఇచ్చేవాళ్లు. చాలా నాళ్ల తర్వాత మళ్లీ మజిలీ సినిమాకు షీల్డ్ తీసుకోవడం ఆనందంగా ఉంది. చైతన్య తొలి చిత్రం జోష్ సినిమాలో బొమ్మలా ఉంటే.. ఈ సినిమాలో దానమ్మలా ఉన్నారు. అలాగే పోలీస్ పాత్రలంటే ఎందుకు పడవంటే.. నేను శ్రీహరికి చాలా పోలీస్ క్యారెక్టర్స్ రాశాను. పోలీస్ అంటే ఆయనలా ఫిట్‌గా ఉండాలి. నేను అంత ఫిట్‌గా ఉండను. ఆ డ్రెస్ వేసుకుంటే చెండాలంగా ఉంటాననే భయం. అయితే అలాంటి పాత్రలో నాకు పేరొచ్చింది టెంపర్ సినిమాలో పాత్ర. ఈ మధ్య మజిలీ సినిమాలో సమంత తండ్రిగా.. చిత్రలహరిలో తేజు తండ్రిగా నటించాను. ఈ రెండు పాత్రలు వేర్వేరుగా ఉంటాయి. టెంపర్‌లో నాకు ఎంత మంచి పేరొచ్చిందో ఈ రెండు పాత్రలకు నాకు అంతే మంచి పేరొచ్చింది. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ – ”ఈ సినిమా నా సినిమా కాదు.. లాస్ట్ మూమెంట్‌లో నాకు బ్యాగ్రౌండ్ స్కోర్ చేసే అవకాశం వచ్చింది. చివరి 8 రోజుల్లో ఆర్ ఆర్ చేశాను. శివలో లవ్, ట్రస్ట్‌ను చూసి నమ్మకంతో చేశాను. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. ఈ సినిమాకు పనిచేసిన వారందరూ కూడా ప్రేమతోనే పనిచేశారు. ఒక బిట్ కరెక్షన్ కూడా చేయడానికి సమయం లేకుండా పనిచేస్తూ వచ్చాం. కనెక్టివిటీ చేస్తూ చేయడం మ్యాజిక్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ బ్రిలియంట్‌గా పని చేశారు. భార్య డెలివరీకి సిద్ధంగా ఉన్నా కూడా సినిమాపై ప్యాషన్‌తో తను ఈ సినిమా కోసం వర్క్ చేశాడు. తన కమిట్‌మెంట్ చూసి నేను ఇంకా కష్టపడ్డాను. శివ, సాహు పెట్టుకున్న నమ్మకమే ఇంత మంచి ఔట్‌పుట్‌ని తెచ్చింది” అన్నారు.
https://photos.tfpc.in/divyansha-kaushik-latest-photos/1100/