చిత్ర‌ల‌హ‌రి యూనిట్‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభినంద‌న‌లు

pawan kalyan

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ను అప్రిషియేట్ చేశారు.

ఇటీవ‌ల సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సాయితేజ్‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడ్ని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమాను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూశారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చ‌డంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకెల‌ను పంపారు. `కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను` అంటూ మెసేజ్ కూడా పంపారు పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.