
నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎఐ (AI) చిత్రం “అంబా’స్ రివెంజ్”. ప్రమోద్ ఎంసి సంగీతం అందించిన ఈ ఎఐ చిత్రానికి హ్యారీ బ్రెయిన్ ఎడిటింగ్ & డిఐ చేయగా కిషోర్ కుమార్ ఏనుగు డైలాగ్స్ & లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ప్రజలకు చేరువ అవుతున్న లేటెస్ట్ ఎఐ టెక్నాలజీ ద్వారా రూపొందిన ఈ విజువల్ ఫీస్ట్ చిత్రం భారత దేశపు ఇతిహాసాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహాభారతంలోని అంబ ప్రతీకారం నుండి తీసుకోబడింది. మహాభారతంలో భీష్ముని వల్ల ఒక జన్మలో మరణించిన కారణం, మరో జన్మలో భీష్ముని పై ఆమె పగ తీర్చుకున్న ప్రయాణాన్ని చూపించే దిశగా ఈ చిత్రం ఉంటుంది. మనుషులు ఎవరు నటించకుండా కేవలం ఎఐ ద్వారా రూపొందించిన ఈ చిత్ర టీజర్ నేడు మీడియా సమక్షంలో విడుదల చేయడం జరిగింది.
విజువల్ డైరెక్టర్ సాయి నేత మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సపోర్ట్ అందిస్తున్న అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ప్రేక్షకులు అందరూ మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి మాట్లాడుతూ… “మహాభారతంలోని ఒక అంశాన్ని తీసుకుని సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాము. మీడియా వారి సపోర్ట్ ఉండవల్సిందిగా కోరుకుంటున్నాము” అన్నారు.
డైలాగ్స్ & లిరిక్స్ రచయిత కిషోర్ కుమార్ ఏనుగు మాట్లాడుతూ… “నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమాలో 2 పాటలు ఉంటాయి. నేటి తరానికి అర్థం అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకి ఎక్కించడం జరిగింది” అన్నారు.
ఎడిటర్ హ్యారీ బ్రెయిన్ మాట్లాడుతూ… “నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రస్తుతం వస్తున్న కొన్ని ఎఐ రీల్స్ వల్ల ప్రేక్షకులకు ఎఐ సినిమా అంటే ఒక అవగాహన ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా మంచి విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. అందరూ సినిమాను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
క్యారెక్టర్ డిజైనర్ చందు గోసంగి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. నాకు అవకాశం ఇచ్చి, చిత్రంలో నాకు సపోర్ట్ అందించిన చిత్ర బృందం అందరికీ థాంక్స్” అన్నారు.
నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఎఐలో సినిమా చేయడం చాలా ఖర్చుతో కూడిన విషయం. సాధారణంగా ఇటువంటి సినిమా చేయాలంటే తక్కువ ఖర్చు అనుకుంటారు కానీ మేము ఒక టూల్ ఉపయోగించేలోపు మరొక టూల్ వస్తుంది. అలాబ్మాకు ఖర్చు ఎక్కువ అయింది. ప్రస్తుతం అందరూ రీల్స్ లో ఎఐ చూస్తున్నారు కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది” అన్నారు.
దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ… “సినిమా అంబ అయినప్పటికీ ఈ సినిమా శిఖండి నుండి చూడబోతున్నాము. సినిమాలో ప్రముఖ పాత్రలు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈ టీజర్ విడుదల చేయడం జరిగింది. టీజర్ లో డైలాగ్స్ కూడా లేవు, త్వరలో ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాము” అన్నారు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ – నక్క తోక ఫిల్మ్స్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – జైవర్ధన్ మేడి
నిర్మాత – యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్
విజువల్ డైరెక్షన్ – సాయి నేత
ఎడిటింగ్ & డిఐ – హ్యారీ బ్రెయిన్
డైలాగ్స్ & లిరిక్స్ – కిషోర్ కుమార్ ఏనుగు
క్యారెక్టర్ డిజైన్ – చందు గోసంగి
సంగీత దర్శకుడు – ప్రమోద్ ఎంసి
సౌండ్ డిజైన్ & మిక్సింగ్ – ఙ్ఞాన ప్రకాష్
పిఆర్ఓ – తేజస్వి సజ్జ


