కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ క్లోజ్ అయ్యి సినిమా ఇండస్ట్రీ బాగా ఇబ్బందుల్లో ఉంది. దానినే నమ్ముకున్న ఎంతో మందికి ఈరోజు పని లేకుండా పోయింది. కరోనా ఇంపాక్ట్ తగ్గి అన్ లాక్ పేరుతో అన్నీ ఓపెన్ చేస్తున్నారు కానీ థియేటర్స్ మాత్రం ఓపెన్ కావట్లేదు. ఈ కష్టాలు ఇంకెప్పుడు తీరుతాయో తెలియదు కానీ అస్సాం ప్రభుత్వం మాత్రం థియేటర్స్ కి బూస్టింగ్ ఇస్తూ కొత్త విధానం తీసుకోని వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి థియేటర్స్ ఏ ప్రధానం కాబట్టి ఆ థియేటర్స్ ఓపెన్ చేసే వారికి, రెనోవేట్ చేసే వారికి అస్సాం గవర్నమెంట్ సబ్సిడీ ప్రకటించింది.
కొత్తగా థియేటర్స్ ఓపెన్ చేసే వారికీ 25% లేదా 75 లక్షలు, పాత థియేటర్స్ ని తెరిచిన వారికి 50 లక్షలు, ఉన్న థియేటర్స్ నే రెనోవేట్ చేసుకున్న వారికి 25 లక్షలు సబ్సిడీ ఇస్తూ అస్సాం గవర్నమెంట్ చెక్కులు పంపిణీ చేస్తుంది. అస్సాం సీఎం అస్సాం స్టేట్ ఫిల్మ్ తరపున ఈ సబ్సిడీని ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తే ఇక్కడ సినిమాల్లోకి డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావాలనుకునే వారికీ చాలా హెల్ప్ అవుతుంది. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలాంటి సబ్సిడీ ఆలోచనని ఏమైనా కన్సిడర్ చేస్తారేమో చూడాలి.