బాలీవుడ్ బాబా సంజయ్ దత్ ఇటీవలే బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఊపిరి ఆడకపోవడంతో అడ్మిట్ అయిన సంజయ్ దత్, అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ట్రీట్మెంట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న బాబా, దుబాయ్ లోని ఫ్యామిలీతో రీయునైట్ అయ్యాడు. సంజూ ఫ్యామిలీ ముంబైలోనే ఉండేవారు కానీ కొన్ని నెలల ముందే దుబాయ్ కి వెళ్లారు. ఈలోపు సంజయ్ దత్ కి హెల్త్ ఇష్యూ రావడం అతను హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది.
తన ట్రీట్మెంట్ నుంచి గ్యాప్ తీసుకున్న సంజయ్ ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సంజూతో పాటు పిల్లలు కూడా ఉన్న ఫోటోని నెట్ లో పెట్టిన మాన్యత… “”Today…I want to thank God for the gift of family. No complaints…No requests… just to be together, forever,” she captioned the post. She tagged the post with Amen#blessedbeyondmeasure, #love, #grace, #positivity, #dutts, #beautifullife, and #thankyougod.” అంటూ పోస్ట్ చేసింది. అయితే సంజయ్ దత్ కి కేవలం బ్రీతింగ్ ప్రాబ్లమ్ కాదని లాంగ్ క్యాన్సర్ ఉందని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నెహతా ట్వీట్ చేశాడు. ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు కానీ సంజయ్ దత్ మాత్రం ఫ్యామిలీతో ప్రశాంతంగా గడుపుతున్నాడు.