కరోనా నుంచి కోలుకున్న మెగాబ్రదర్

అంజనా ప్రొడక్షన్స్ హెడ్, మెగాస్టార్ చిరంజీవి బ్రదర్ నాగబాబు ఎప్పుడూ టీవీ షోస్ తో బిజీగా ఉంటాడు. ఒక ప్రముఖ ఛానెల్ లో కామెడీ షోకి జడ్జ్ గా చేస్తున్న నాగబాబుకి కరోనా పాజిటివ్ గా అని తేలింది. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న నాగబాబు, కరోనా మహమ్మారిని జయించి హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.

ఇటీవలే నిహారిక ఎంగేజ్మెంట్ లో పాల్గొన్న నాగబాబు, ఆ తర్వాత హాస్పిటల్ కే పరిమితమయ్యారు. ఇప్పటివరకూ ఆ ప్రముఖ ఛానెల్ లో వచ్చిన బ్యాంకింగ్ ఎపిసోడ్స్ కాబట్టి, కరోనా తగ్గిన నాగబాబు త్వరలోనే మళ్లీ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది.