అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్న విషయం తెలిసిందే. నిర్మాతలు గత వారమే 15 రోజుల నిడివి గల ఒక షెడ్యూల్లో పూర్తి చేయాలని భావించారు. కానీ కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు, ఫ్యాన్స్ కి మంచి అప్డేట్ ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 20న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా అందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని చెప్పకపోయినప్పటికి దాదాపు అదే డేట్ ఫిక్స్ అయినట్లు టాక్ వస్తోంది. లవ్ స్టోరీ మొదటి లిరికల్ సాంగ్, ఏయ్ పిల్లా ఈ ఏడాది మార్చిలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాపై ఆ సాంగ్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్, నారాయణదాస్ నారంగ్ యొక్క శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని కృష్ణ మురళి మరియు దేవయాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.