సినిమా హాల్స్ మల్టీప్లెక్స్ ల భవితవ్యం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నెల ఈ నెల 8న ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో థియేటర్స్ ఓపెనింగ్ పై ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల సినీమా ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఫిర్దూసుల్ హసన్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి సి.కళ్యాణ్, సౌథ్ ఇండియన్ ఫుల్మ్ ఛాంబర్ నుంచి జైరాజ్, కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్ నుంచి నందకుమార్ అలాజ్ సునీల్ నారంగ్, త్రిపుర్ సుబ్రహ్మణ్యం, కట్రగడ్డ ప్రసాద్ వంటి సినీ ప్రముఖులు మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఇక థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయనే విషయంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోధించాల్సిన విషయాలపై కూడా చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ లను కూడా థియేటర్స్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తారా లేదా అనే విషయంపై కూడా చర్చించనున్నారు. నాన్ సెన్సార్ కాబట్టి ఈ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.