‘తోలు బొమ్మల సిత్రాలు’ లోగో ఆవిష్కరణ!!

కోమారి జానకిరామ్ దర్శకత్వంలో నిర్మిస్తన్న చిత్రం యొక్క తొలుబొమ్మల సిత్రాలు బ్యానర్ వీడియో మరియు లోగోను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
ఎస్. బి.అంజద్ భాషా గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ…
సినిమా పుట్టుకకి బీజమైన తోలుబొమ్మలాట కళని తోలుబొమ్మల సిత్రాలు అని బ్యానర్ గా నిర్మించినందుకు అభినందిస్తూ ఈ బ్యానర్ తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంస్థగా ఎదగాలని ఈ బ్యానర్ లో మరిన్ని మంచి చిత్రాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నానని తెలిపారు.

దర్శకులు కొమారి జానకిరామ్ మాట్లాడుతూ…
మా తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ లోగో మరియు వీడియా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్ర కథాంశంను తెలుసుకొని ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని వారు తెలుపడం సంతోషం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ ను ఇతర విషయాలను త్వరలో తెలుపుతానని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరామెన్ డి.యాదగిరి, ఎడిటింగ్ సునీల్ మహారణ, సంగీతం యు.వి.నిరంజన్, నిర్మాత కొమారి జానయ్య నాయుడు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోమారి జానకిరామ్.