
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్నారంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు దక్కించుకుంటోంది “చెన్నై లవ్ స్టోరీ” సినిమా. ఈ సినిమా 3 రోజుల్లోనే 40.1 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్ ను యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
దర్శకుడు, నటుడు దేవిప్రసాద్ మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ లాంటి మంచి ప్రేమ కథా చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఇవ్వడం ద్వారా మమ్మల్నీ భాగం చేశారు నిర్మాతలు ఎస్ కేఎన్, సాయి రాజేష్. రచయితగా, దర్శకుడిగా సాయి రాజేష్ ను అభిమానిస్తాను. ఆయన హృదయ కాలేయం సినిమా నుంచే తన ప్రతిభ నిరూపించుకున్నారు. అన్నారు.
దర్శకుడు, నటుడు కరుణ కుమార్ మాట్లాడుతూ – సినిమాల ట్రెండ్ మారుతున్నా, ఎప్పటికీ మారనివి ప్రేమ కథలు మాత్రమే. అలా వచ్చిన మంచి ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. తెలుగు సినిమా గౌరవాన్ని రెట్టింపు చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఒక కన్విక్షన్ తో టీమ్ అంతా చేసిన సినిమా కాబట్టే గొప్ప విజయం సాధించారు. అన్నారు.
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ – ఏ నిర్మాతలైనా ఆదివారం వరకు గుండెల మీద చేయి వేసుకుని ఉంటారు. సోమవారం వారిలో ఉత్కంఠ మొదలవుతుంది. సోమవారం కూడా మంచి వసూళ్లు వస్తున్నాయంటే మా సినిమా నిజంగా పెద్ద విజయం సాధించినట్లు. అలాంటి విజయాన్ని మా సినిమాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.
మైత్రీ శశి మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ సినిమాకు నైజాంలో మార్నింగ్ షోస్ 40 లక్షల గ్రాస్ వస్తే మ్యాట్నీకే 90 లక్షలకు పెరిగింది. అంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంత ఫాస్ట్ గా రిసీవ్ చేసుకున్నారు అనేది తెలుస్తోంది. అక్కడి నుంచి ఈ సినిమా వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిన్న విమల్ థియేటర్ కూడా హౌస్ ఫుల్ అయ్యింది. జిల్లాల్లోనూ మంచి కలెక్షన్స్ ఉన్నాయి. కిరణ్ గారి కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని మేము నమ్ముతున్నాం. అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – సాయి రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఆయనను నిన్ననే కలిశాను. మండే కూడా కలెక్షన్స్ చూడాలి అన్నారు. నిజంగానే సోమవారం కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్లే. అలాంటి గొప్ప విజయాన్ని చెన్నై లవ్ స్టోరీకి ప్రేక్షకులు ఇచ్చారు. హీరోల పేర్లు చూసి సినిమాలకు వెళ్తుంటాం. అలా సాయి రాజేష్ తన పేరుతోనే థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించేంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు. అన్నారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ – చెన్నై లవ్ స్టోరీ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. ఈ పాత్రతో నా కెరీర్ మరింత పెరుగుతోంది అనిపిస్తోంది. ఎన్నో ప్రశంసలు నా క్యారెక్టర్ దక్కుతున్నాయి. క్లాసిక్ లవ్ స్టోరీస్ లా లైబ్రరీలో పెట్టుకునే స్థాయి మంచి ప్రేమ కథా చిత్రమిది. ఈ మూవీకి ఇంకా షోస్ పెంచమని ప్రొడ్యూసర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతి మాట్లాడుతూ – సీడెడ్ లో నిన్న చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్స్ చూశాక సర్ ప్రైజ్ అయ్యాం. డే 1 కలెక్షన్స్ లో 50, 60 పర్సెంట్ మూడో రోజు ఉంటే చాలా బాగుంది అనుకుంటాం. అలాంటిది 90 పర్సెంట్ కలెక్షన్స్ రావడం ఆశ్చర్యపరిచింది. ఇవాళ మార్నింగ్ షోస్ కలెక్షన్స్ నిన్నటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు. అన్నారు.
ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – ఈ సినిమా చూసినప్పుడే సూపర్ హిట్ అవుతుందని అందరికీ కాల్ చేసి చెప్పాను. డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నిన్న కూడా అందులో 90 పర్సెంట్ ఉన్నాయి. రెండు వారాల దాకా ఈ సినిమా స్పీడ్ ఆగదు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుంది. ఒక యంగ్ టీమ్ కు ఇలాంటి సక్సెస్ రావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఏడాదిన్నరగా ఈ సినిమా మాకు ఎన్నో ఎమోషన్స్ ను పంచుతోంది. ఈ రోజు మా టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నా. ఈ మూవీకి అద్బుతమైన కథను రాసిన సాయి రాజేష్ గారికి థ్యాంక్స్. నివిగా నేను పర్ ఫార్మ్ చేయగలను అని ఆయన నమ్మారు. ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ నా కెరీర్ బిగినింగ్ లో దక్కడం సంతోషంగా ఉంది. నాకు నిజమైన కెరీర్ ఇచ్చిన చిత్రమిది. ఈ చిత్రాన్ని తన భుజాలపై ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ గారు మోశారు. ధీరజ్ గారు మా సినిమా వెనక ఒక ఫోర్స్ గా పనిచేశారు. కిరణ్ గారు ఒక అమేజింగ్ కోస్టార్. ఒక మంచి సినిమా చేశామని మేము నమ్ముతూ వచ్చాం. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చూపిస్తున్న ఇంత ప్రేమను ఊహించలేకపోయాం. మా సినిమా గురించి ప్రతి డీటెయిల్ ను ప్రశంసిస్తున్నారు.
కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – తెలుగు తెరపై ఇలాంటి ప్రేమ కథ రాలేదు, మీరు సినిమా చూసి గుండెల్లో ఆ ఫీల్ నింపుకుంటారు అని చెప్పాను. నేను చెప్పినట్లే మీ ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది. స్టీవెన్ శంకర్ మీ మనసులో ఉండిపోతాడు. కిరణ్ అబ్బవరం లేకుంటే ఇలాంటి మంచి సినిమా వచ్చేది కాదు. గౌరి బ్యూటిఫుల్ గా చేశాడు. రవి కష్టానికి ఫలితం దక్కింది. అన్నారు.
డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ – ఈ సినిమా విజయానికి నా టీమ్ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. వాళ్లు నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. నా భార్య స్వప్న ఎంతో సపోర్ట్ చేసింది. గత ఏడాదిన్నరగా ఫ్యామిలీని చూసుకుంది. ఆమె లేకుంటే నేను ఈ వేదిక మీద ఉండేవాడిని కాదు. నన్ను నమ్మి అవకాశం కల్పించిన మా సాయి రాజేష్, ఎస్ కేఎన్ కు థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్, స్టోరీ రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – నాగచైతన్య గారు బంగారం అని ఇందాక ఎవరో అన్నారు. అది అక్షరాలా నిజం. షూటింగ్ టైమ్ లో ఆయన వర్కర్స్ తో కూడా ఎంత ప్రేమగా ఉంటారో చూశాను. ఈ సినిమా ఈవెంట్ కు ఆయనకు రావాల్సిన అవసరం లేదు. కానీ మేము అడగగానే వచ్చారు. ఆయన వస్తే మా సినిమాకు మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయి. నాకు కెరీర్ లో ఏదీ సులువుగా దక్కలేదు. నా గత నాలుగు సినిమాలు బేబితో సహా మార్నింగ్ షోస్ టాక్ అనుకున్నట్లు రాలేదు. బేబి సినిమాకు కూడా మార్నింగ్ షోస్ కంప్లీట్ అవుతుంటే నేను ఎస్ కేఎన్ బయటకు వచ్చి ఇది కూడా పోయిందని బాధపడ్డాం. కానీ చెన్నై లవ్ స్టోరీ అలా కాదు. ఇది మంచి సినిమా అని మొదటి నుంచి గట్టిగా బిలీవ్ చేశాం. డేట్ ఇది కాకుంటే మరొకటి ఊహించలేకపోయాం. ప్రొడ్యూసర్స్ కు ఉండే కష్టాలు ఎవరికీ అవసరం లేదు. రిలీజ్ చేశాక మార్నింగ్ షోస్ కు మాస్ కు నచ్చదు, డిప్ అవుతుంది..ఈ మాటలు ఇండస్ట్రీలో ఇన్నేళ్లలో విననంతగా ఈ సినిమాకు విన్నాను. చేయాల్సిన కరెక్షన్స్ ఫాస్ట్ చేసి ప్రేక్షకులకు ఇచ్చాం. ఈ క్రమంలో మాకు సహకరించిన అన్నపూర్ణ స్టూడియో వారికి థ్యాంక్స్. చెన్నై లవ్ స్టోరీ ఎర్లీ టాక్ తో ఒక్కడినే గదిలో ఉండిపోయి బాధపడ్డాను. మా వాళ్లంతా సింగిల్ స్క్రీన్స్ కు వచ్చి చూడు రెస్పాన్స్ చాలా బాగుంది అన్నారు. మండే కలెక్షన్స్ చూసి గానీ నేను సినిమా సూపర్ హిట్ అని నిర్థారించుకోను అన్నాను. అలా నిన్న కలెక్షన్స్ చూశాక సంతోషంగా చెబుతున్నా. మా సినిమాను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు. ఇక ఎవరేం అన్నా బాధలేదు. అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఒక అద్భుతం జరిగే ముందు ఎవరూ నమ్మరు. జరిగిన తర్వాత ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు. నేను గానీ సాయి రాజేష్ గానీ సినిమా విషయంలో కేర్ తీసుకునేది ఇద్దరి విషయంలో ఒకటి టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకుడు, రెండు సినిమా వెనక బ్యాక్ బోన్ లా నిలబడే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. వాళ్లు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం. నాలుగు రోజుల్లోనే ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్ని ఏరియాల్లో మా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాదు అంతకుమించిన సక్సెస్ సాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ శశి గారు, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతి గారు ఇదే విషయాన్ని చెప్పారు. నెక్ట్స్ ప్రెస్ మీట్ లో ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ వస్తారు. వాళ్ల సంతోషం నాకు చాలు. 2500 జీతంతో టీవీ ఛానెల్ లో పనిచేసిన వ్యక్తిని. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు. సాయి రాజేష్ లాంటి మంచి డైరెక్టర్ దొరికితే ప్యాషన్ తో రెండు మూడేళ్లకో సినిమా చేస్తా. సినిమా రిలీజైన ఆరు గంటల్లో ఇండస్ట్రీలో మాపై ఎంత ప్రేమ ఉందో, ప్రేక్షకుల్లో ఎంత ఉందో చూశాం. కిరణ్ లాంటి హీరో దొరకడం మా అదృష్టం. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మాకు ధైర్యాన్ని ఇచ్చారు. కిరణ్ గారిలో ఇదే తపన మీలో ఉన్నంతకాలం మీకు రైజింగ్ తప్ప కిందకు చూడాల్సిన అవసరం ఉండదు. ఫ్యూచర్ లో అద్భుతాలు చేస్తారు. ఈ సినిమా చేస్తున్న నెంబర్స్ కంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే చూడొచ్చు అనే అభిమానం సంపాదించుకున్నారు. ఈ కలెక్షన్స్ కంటే ఆ క్రెడిబిలిటీ గొప్పది. గౌరి ప్రియ పర్ ఫార్మెన్స్ తో ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్ మారిపోతాయి. ఇలాంటి తెలుగు అమ్మాయిని తీసుకుంటే మన భావోద్వేగాలను సరిగ్గా పలికిస్తుంది. మా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే నేను రెండు మ్యానేజ్ చేయాలి. ఒకటి ప్రమోషన్స్, రెండు సాయి రాజేష్ ఎమోషన్స్. హౌస్ పుల్స్ అవుతున్నాయంటే నువ్వే టికెట్స్ కొంటున్నావా అంటారు. స్క్రీన్ షాట్ చూపిస్తే, ఏఐలో చేశావా అంటారు. మండే కలెక్షన్స్ చూసి గానీ సాయి రాజేష్ సినిమా విజయాన్ని నమ్మలేదు. ఈ రోజు మంచి చొక్కా వేసుకుని హ్యాపీగా తిరుగుతున్నాడు. ఈ సినిమాను రిలీజ్ రోజు మొదట చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేసిన వ్యక్తి మైత్రీ నవీన్ గారు. ఆయన సినిమా చూసి అలా ఉండిపోయారు. ఇంత బాగుందేంటి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ ఆగదు అన్నారు. ఆయన మాటలతో మేము చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇండస్ట్రీలో కొందరికి సినిమా చూసిస్తే రంధ్రాన్వేషణ చేసి మాకే జడ్జిమెంట్ ఉందనుకుంటారు. జడ్జిమెంట్ అంటే ప్రేక్షకుల నాడిని ముందే పసిగట్టటం. అలా తెలుసుకోగలరు కాబట్టే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ గా మైత్రీ సంస్థ నిలిచింది. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ కు రాజముద్ర అక్కినేని ఫ్యామిలీది. యువసామ్రాట్ నాగచైతన్య గారి రాజముద్ర మా సినిమాకు దక్కడం సంతోషంగా ఉంది. ఈరోజు షూటింగ్ ఉండి కూడా చైతూ గారు మా ఈవెంట్ వచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. నాగచైతన్య గారితో ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని ఉంది. అన్నారు
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – నాగచైతన్య అన్నను చూడగానే మన మంచిని కోరేవారు అనిపిస్తుంటుంది. నా క సినిమా ఈ వెంట్ కు వచ్చారు. ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ మీట్ కు వచ్చారు. నన్ను సపోర్ట్ చేస్తున్న చైతన్య గారికి థ్యాంక్స్. స్టీవెన్ శంకర్ లాంటి మెమొరబుల్ క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ రవి కి థ్యాంక్స్. ఇది నేను చేస్తే బాగుంటుంది అని నమ్మిన సాయి రాజేష్ కు థ్యాంక్స్. మా టీమ్ కు శుభాకాంక్షలు. ప్రేక్షకులకు పేరు పేరునా కృతజ్ఞతలు. అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూస్తున్నారు. మీ అందరినీ థియేటర్స్ లో చూస్తుంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరంతా మూవీకి కనెక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మా క్యారెక్టర్స్ కు రిలేట్ అవుతున్నారు. థియేటర్స్ నుంచి బయటకు వచ్చాక పేరాగ్రాఫ్ లకు పేరాగ్రాఫ్ లు మెసేజ్ లు పంపిస్తున్నారు. ఫ్యామిలీ చాలా ముఖ్యం. ప్రయాణాల్లో తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెబుతుంటారు. సేఫ్ గా డ్రైవ్ చేయండి. నాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
హీరో నాగచైతన్య మాట్లాడుతూ – ఈ ఈవెంట్ కు వచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేదిక మీద మీ అందరి సక్సెస్ సెలబ్రేట్ చేయడం నాకు హ్యాపీగా ఉంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వస్తారా అని సాయి రాజేష్ అడిగారు. నేను వేరే బిజీ వర్క్ వల్ల రాలేకపోయాను. అప్పుడు చాలా బాధపడ్డా. ఈ సినిమా సక్సెస్ అయ్యాక కాదు సక్సెస్ కు ముందే వీళ్ల మూవీని ప్రమోట్ చేయాలని నా మనసులో బలంగా ఉండేది. నాకు పర్సనల్ గా లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. కోవిడ్ తర్వాత లవ్ స్టోరీస్ తగ్గిపోతుంటే బాధపడ్డాను. లవ్ స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తారా వెళ్లరా అని భయపడ్డాను. మెల్లిగా ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. ఈ చెన్నై లవ్ స్టోరీతో మరో కల్ట్ లవ్ స్టోరీ ఇండస్ట్రీకి ఇచ్చారు. మనం ఎన్నో విభిన్నమైన ప్రేమ కథలు చూశాం. పెళ్లయ్యాక, లవ్ బ్రేకప్ అయ్యాక వాళ్ల కథలు ఎలా ఉంటాయి అనే సంక్లిష్టమైన బ్యాక్ డ్రాప్ లు కూడా వస్తున్నాయి. ఈ తరం ప్రేక్షకులు అలాంటి ప్రేమ కథలకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఒక జంట తమ జీవితంలోని ఎత్తుపల్లాలు, జయాపజయాలు గురించి డిస్కస్ చేసుకునే మూవ్ మెంట్స్ ను ఏ ప్రేమ కథల్లోనూ క్యాప్చర్ చేయడం లేదు. ఆ తరహా స్టోరీస్ రావాలని, ఆ టాపిక్స్ దర్శకులు ఎంచుకోవాలని ఎదురుచూస్తున్నాను. ఒక యాక్టర్ గా అలాంటి ప్రేమ కథలు వస్తే బాగుండును అనుకున్నాను. చెన్నై లవ్ స్టోరీలో నేను కోరుకునే ప్రేమ కథను చూశాను. ఈ సినిమా చూశాక ఎంతో సంతోషించాను. పరిణితితో రాసిన ప్రేమ కథ ఇది. ఇంత మంచి కథ రాసి మరో దర్శకుడికి ఇవ్వడంలోనే సాయి రాజేష్ గొప్పదనం కనిపిస్తోంది. తనతో పాటు తన వాళ్లూ ఎదగాలని సాయి రాజేష్ చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. కాంప్లెక్స్ ఎమోషన్స్ ఉన్న ఇలాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీని రవి నంబూరి చక్కగా తెరకెక్కించాడు. అందరికీ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యేలా మూవీని ప్రెజెంట్ చేశాడు. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. మంచి కంటెంట్ తో సినిమా చేయడం, ఆ సినిమాను ప్రతి ఒక్కరికీ చేర్చడం ఎలాగో ఎస్ కేఎన్ కు తెలుసు. తండేల్ టైమ్ లో ప్రమోషన్ లో ఎస్ కేఎన్ చాలా సపోర్ట్ చేశాడు. క ఈవెంట్ లో కిరణ్ మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇంటికి వెళ్లి కూడా అదే ఆలోచనలో ఉండిపోయాను. తన కష్టాలు, అడ్డంకులన్నీ దాటుకుని ఎన్నో మెట్లు పైకి ఎక్కి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తను సినిమా కోసం ఎంత కష్టపడతాడో తెలుసు. ఈ సినిమా బ్రాస్ లెట్ ఇంకా వేసుకునే ఉన్నాడు. శేఖర్ కమ్ముల గారి లవ్ స్టోరీ సినిమా టైమ్ లో గౌరి నాకు పరిచయం. తన క్యారెక్టర్ పర్ ఫార్మ్ చేసి వెళ్లిపోయేది. నివి లాంటి క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేసి తన పర్ ఫార్మెన్స్ తో మెప్పించడం సులువైన పనికాదు. ఈ సినిమా గౌరికి టర్నింగ్ పాయింట్. ఈ సినిమాలో గౌరి చేసిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయి. అమ్మ ప్రేమ గురించి కిరణ్ చేసిన సీన్, చెప్పిన డైలాగ్స్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేశాయి. అంత బాగా పర్ ఫార్మ్ చేసిన వీళ్లద్దరికి హ్యాట్సాఫ్. ఈ టీమ్ అందరిలో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే వీళ్లంతా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. మనం కూడా మంచి సినిమాలు చేయాలనే పిచ్చి, ప్యాషన్ తో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఇలాంటి సక్సెస్ లు సాధిస్తున్నారు. వీళ్ల విజయం నాకెంతో స్ఫూర్తినిస్తోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఎంతోమంది కొత్త వాళ్లకు కూడా వీళ్ల విజయాలు ఇన్సిపిరేషన్ గా నిలుస్తాయి. ఒక పోస్టర్ మీద కలెక్షన్స్ నెంబర్స్ వేయడం కంటే ఇది నిజమైన సక్సెస్. ఒక ప్రేమ కథ ఇలాంటి నెంబర్స్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయడం అద్భుతం. వచ్చే వీకెండ్ కూడా కలెక్షన్స్ చాలా బాగుంటాయి. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, త్రిగుణ్, సిరి హన్మంతు, దేవిప్రసాద్, కరుణకుమార్, మహేందర్, నరేష్, పూజ, ప్రమోదిని, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేష్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి


