
తెలుగు సినీ రంగానికి, తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన మహానటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారకరామారావు గారి అర్ధాంగి, కరుణామూర్తి శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి వేడుకలను ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు
నందమూరి వంశానికి జీవన జ్యోతిగా, ఎన్టీఆర్ గారి ప్రతి విజయం వెనుక నిశ్శబ్ద శక్తిగా నిలిచి, నందమూరి కుటుంబానికి బలమైన పునాదులు వేసిన మాతృమూర్తి శ్రీమతి బసవరామతారకం గారు. పిల్లలను క్రమశిక్షణతో, ఉత్తమ విలువలతో తీర్చిదిద్ది ఆదర్శవంతమైన ఆదర్శ గృహిణిగా ఆమె నిలిచారు.
ఇక ఈ పవిత్రమైన శత జయంతి వేడుకల సందర్భంగా.. ఆ పుణ్య దంపతుల జ్ఞాపకార్థం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్’ రూపుదిద్దుకుంది. మానవ సేవే మాధవ సేవ’ అనే మూలసూత్రంతో ఈ ట్రస్ట్‌ను ప్రారంభించారు. కేవలం ఒక సంస్థగా మాత్రమే కాకుండా.. ధర్మం, సేవ, సంస్కృతి మరియు కళలను కాపాడుతూ సమాజానికి సేవ చేయడమే ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.”
“ఈ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులు వహిస్తున్నారు:
ఛైర్మన్‌గా: శ్రీ నందమూరి మోహన కృష్ణ గారు
మేనేజింగ్ ట్రస్టీగా: శ్రీమతి నందమూరి మోహన రూప గారు
ట్రస్టీలుగా: శ్రీమతి నందమూరి సీమంతిని మరియు శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారలు బాధ్యతలు చేపట్టారు.”
“ఈ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఈరోజు: శత జయంతి సందర్భంగా ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రేపు: ఎన్టీఆర్ గారి స్వగ్రామమైన నిమ్మకూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.”
“ఈ సేవా కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములై, తమ ఆశీస్సులు అందించాలని నందమూరి కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు.సమాజ సేవలో ఈ ట్రస్ట్ మరింత ముందుకు సాగాలని కోరుకుందాం..


