సుశాంత్ కేసుపై తప్పుడు వార్తలు.. మీడియాపై తాప్సి షాకింగ్ కామెంట్స్!!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో ప్రధాన నిందితురాలుగా రియా చక్రవర్తి ఉందంటూ మీడియా లో వస్తున్న ఆరోపణలపై తాప్సీ పన్నూ ఇటీవల ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. “నాకు సుశాంత్ వ్యక్తిగతంగా తెలియదు, అలాగే రియా కూడా పెద్దగా తెలియదు. కాని ఒక విషయం నాకు బాగా తెలుసు. నేరం నిరూపించబడని వ్యక్తిని దోషిగా తేల్చడం కరెక్ట్ కాదు. న్యాయవ్యవస్థను అధిగమించడం చాలా తప్పు అని అర్థం చేసుకోగలిగే ఆలోచన ఉండాలి.

మరణించిన వ్యక్తి కోసం న్యాయం జరగాలంటే చట్టాన్ని గౌరవించిల్సిన అవసరం ఎంతైనా ఉందని తాప్సి వివరణ ఇచ్చింది. అదే విధంగా ఈ కేసుపై కోర్టు మరియు సిబిఐ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా కొన్ని తప్పుడు వార్తలను మీడియాలో చూస్తున్నానని తెలిపింది. అలాగే ఈ వార్తలు చూస్తున్న జనాలను కన్ఫ్యూజన్ కి గురి చేస్తాయని అంటూ.. మీడియా వలన ప్రతిఒక్కరిపై ఒక అభిప్రాయం బలవంతంగా రుద్దబడుతోంది అంటూ తాప్సి తెలిపింది. ఇక ఇటీవల మంచు లక్ష్మి కూడా రియా చక్రవర్తికి మద్దతు పలికిన విషయం తెలిసిందే.