ఘనంగా “తెల్ల కాగితం” ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ – ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్

శ్రీమతి కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైల‌ర్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, కోన వెంకట్, హరీష్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో..

*సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ .. ‘కృష్ణ గారితో నేను ‘జవాన్’ మూవీని చేశాను. కృష్ణ గారు నాకు ఇష్టమైన నిర్మాత. నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చిన నిర్మాత కూడా ఈయనే (నవ్వుతూ). ‘తెల్లకాగితం’ అనేది మన మనసుల్లాంటిది. తెల్లకాగితంపై ఏం రాసుకుంటే మన మనసులో అదే ఉంటుంది. ‘తెల్ల కాగితం’ చిత్రాన్ని అందరూ వీక్షించి పెద్ద సక్సెస్‌ను అందిస్తారని ఆశిస్తున్నాను. రోషన్, నక్షత్ర, రమేష్, కృష్ణ గారికి ఈ మూవీతో మంచి విజయం లభిస్తుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ* .. ‘రోషన్ ఆల్రెడీ యాక్టర్‌గా నిరూపించుకున్నాడు. రోషన్‌కి ‘తెల్ల కాగితం’ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవాలి. హీరోయిన్ నక్షత్ర పేరులోనే స్టార్ ఉంది. నందు చాలా బిజీ రైటర్. ఒకరికి కథ, ఇంకొకరికి మాటలు, మరొకరికి స్క్రీన్ ప్లే ఇస్తూ ఉంటాడు. నందు ఎంటర్టైన్మెంట్ కాకుండా మంచి ఎమోషన్స్ కూడా రాస్తాడు. ‘తెల్ల కాగితం’లో ఆ ఎమోషన్స్ కనిపిస్తాయి. దర్శకుడిగా నందు అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. విజయ్ గారి సంగీతమంటే నాకు చాలా ఇష్టం. కృష్ణ గారి అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌ని నేనే క్రియేట్ చేశాను. ఈ బ్యానర్‌లో నేను కూడా ఓ మూవీని చేస్తాను. కృష్ణకి ఈ చిత్రంతో మంచి లాభాలు రావాలి. దర్శకుడు రమేష్‌కి ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.

*రైట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ కోన వెంకట్ మాట్లాడుతూ* .. ‘నందు అద్భుతమైన రైటర్. అందరికీ పని కల్పించు, ఇలానే మంచి కథల్ని రాస్తూ ఉండు అని నందుకి చెబుతూనే ఉంటాను. ‘ఇరుముడి’ స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుంది. నేల మీద నడిచే కథ ఇది. రోషన్ మంచి సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ ఉంటాడు. కెమెరా ముందుకు వెళ్లే సరికి అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంటాడు. రోషన్‌కి మంచి ఫ్యూచర్ ఉంది. దర్శక, నిర్మాతలకు ఈ చిత్రంతో మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

*హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ* .. ‘తెలిసీ తెలియని ఓ వయసులో చేసే తప్పుల్ని పట్టుకుని ‘తెల్ల కాగితం’ సినిమాని తీశాం. మా కంటెంట్‌ని వైరల్ చేస్తున్న మీడియాకి, మీమర్స్‌కి థాంక్స్. ఇలాంటి కథ నా దగ్గరకు రావడం నా అదృష్టం. ఆడియెన్స్‌లో ఒకడిగా ఈ కథను విన్నా.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రేమను నాకు అందించి థియేటర్‌కి వస్తే.. ‘తెల్ల కాగితం’తో ఆ ప్రేమనంతా తిరిగి ఇస్తా’ అని అన్నారు.

*దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ* .. ‘నేను కథలు పట్టుకుని చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. మా ఆర్ట్ డైరెక్టర్ చిన్నా చివరకు కృష్ణ గారిని పరిచయం చేశారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి థాంక్స్. ఆయన వల్లే ‘తెల్లకాగితం’ అద్భుతంగా వచ్చింది. రాము పాత్ర కోసం ఎంతో మందిని ఆడిషన్స్ చేశాను. కానీ రోషన్‌ని చూడగానే ఫిక్స్ అయ్యాను. నక్షత్ర, శరణ్య గారు, కసిరెడ్డి అన్న ఇలా అందరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. విజయ్ అన్న అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మీ (ఆడియెన్స్) లైఫ్, మీరు చేసిన తప్పులు, మీరు చెప్పుకోలేనివన్నీ ‘తెల్లకాగితం’లో ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

*నటుడు శివాజీ మాట్లాడుతూ* .. ‘‘తెల్లకాగితం’ కథ నాకు తెలుసు. నేను మళ్లీ సినిమాలు చేద్దామని అనుకుంటున్న టైంలో విన్న రెండో కథ ఇది. ఈటీవీ విన్ సాయి ఈ కథ నా దగ్గరకు తీసుకు వచ్చాడు. నేనే ప్రొడక్షన్ చేస్తానని అన్నాను. కానీ చివరకు కృష్ణ వద్దకు వెళ్లింది. ఈ మూవీని ఎవరు చేసినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నాకు తెలుసు. రోషన్‌కి మళ్లీ హిట్ రాబోతోంది. విజయ్ బుల్గానిన్ అద్భుతమై

*రైటర్ నందు మాట్లాడుతూ* .. ‘‘తెల్ల కాగితం’ రిలీజ్ కానంత వరకే చిన్న సినిమా. రిలీజ్ అయ్యాక పెద్ద చిత్రం అవుతుంది. మందు దొరకని రోజు మంచి కిక్ ఇచ్చేందుకు ‘తెల్ల కాగితం’ రాబోతోంది’ అని అన్నారు.

* హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ* .. ‘ఆశ అనే పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అమాయకత్వంతో కూడిన ఇలాంటి మంచి పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుత తరం చూడాల్సిన సినిమా ఇది. కుటుంబ సమేతంగా ‘తెల్ల కాగితం’ చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

తారాగణం: హర్ష్ రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
దర్శకుడు: రమేష్ బండ్రెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: నందు సవిరిగాన
సమర్పణ:  శ్రీమతి కె. శ్రీదేవి
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి
సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్ర‌ఫీ:  కె.వి.గుహన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: చిన్నా
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: అనుదీప్ దేవ్, లిప్సిక
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి
మ్యూజిక్ లేబుల్: సరిగమ

Related Articles

Latest Articles