‘బాయ్ ఫ్రెండ్’ తో కలిసి ఓనమ్ సెలబ్రేషన్స్ కి వెళ్లిన ‘నయనతార’!!

లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న నయనతారా కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. నెక్స్ట్ ఈ స్టార్ హీరోయిన్ రజనీకాంత్ అన్నాత్తే అలాగే మరో రెండు పెద్ద తమిళ సినిమాల్లో నటించనుంది. ఇకపోతే ఈ బ్యూటీ గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు నిరంతరం పుకార్లు వస్తున్నాయి. ఇక ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ జంట ఇప్పుడు ఓనం వేడుకలకు సిద్ధమైంది. స్పెషల్ చార్టెట్ ఫ్లైట్ లో నయనతార, విఘ్నేష్ శివన్ కొచ్చికి వెళ్లారు. నయనతార స్వస్థలమైన కొచ్చిలో దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ ప్యాంటు సూట్ మరియు నియాన్ పసుపులో ఉన్న డ్రెస్ ధరించిన నయనతార స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇక విఘ్నేష్ రెడ్ టీ షర్ట్ మరియు బ్లూ జీన్స్ లో కూల్ గా కనిపిస్తున్నాడు.