కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ కనిపించకుండా భారీ గ్రాఫిక్స్

కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇటీవల రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరీనా మొదటి సారి గర్భంతో ఉన్నప్పుడు చాలా రెస్ట్ తీసుకుంది. షూటింగ్స్ ని దూరంగానే ఉంది. కానీ ఈ సారి విరామం తీసుకునే అవకాశం లేదట. ఈ నటి రానున్న రోజుల్లో అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌ను ముగించాలని ప్లాన్ చేసుకుంటోంది.

అయితే సినిమాలో ఆమె సన్నగా కనిపించడం కోసం VFX వర్క్ ని గట్టిగానే ఉపయోగించనున్నారట. దాదాపు 100 రోజుల షూట్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో కరీనా రెగ్యులర్ షూటింగ్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రెగ్నెన్సీ కనిపించకుండా చిత్ర యూనిట్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి. గతంలో కిక్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ సిక్స్ ప్యాక్ తో కనిపించాలని అనుకోని వర్కౌట్స్ బాగానే చేశాడు. కానీ కరెక్ట్ గా రాకపోవడంతో VFX ద్వారా తన సిక్స్ ప్యాక్ ని వెండితెరపై అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.