KGF దర్శకుడు ఎన్టీఆర్ కంటే ముందు ఆ హీరోతోనే..?

టాలీవుడ్ హీరోల కోసం పరభాషా దర్శకులు ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి మన హీరోలు కరెక్ట్ గా సెట్టవుతారని తెలిసిపోయినట్లు ఉంది. అందుకే ప్రభాస్, తారక్, చరణ్ లాంటి హీరోల డేట్స్ కోసం ఎగబడుతున్నారు. ఇక KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా భవిష్యత్తులో టాలీవుడ్ హీరోలతో ఎక్కువగా వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ అనుకున్న విషయం తెలిసిందే. మరోసారి స్క్రిప్ట్ పై చర్చలు జరిపి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తారక్ కంటే ముందుగానే రామ్ చరణ్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే RRR అయిపోగానే త్రివిక్రమ్ తో కలవనున్నాడు కాబట్టి ఆ గ్యాప్ లో చరణ్ తో ప్రశాంత్ ఒక సినిమాని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.