ప్రస్తుతం కరోనా కష్టకాలంలో సోనూ సూద్ ఎంతో మందికి తన సహాయాన్ని అందిస్తున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తున్న సోనూ సూద్ ఎలాంటి కష్టం ఎదురైనా స్పందిస్తున్నాడు. ఒక ఊరిలో మొబైల్ లో చదువుకోవడానికి కనీసం సిగ్నల్ లేక కొండపైకి వెళ్లి చదువుకుంటున్న ఒక యువతి కష్టాన్ని చూసిన సోనూ ఆ ఊరికి ఏకంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాడు.
మహారాష్ట్రలోని సింధూ దుర్గ్ కు చెందిన స్వాప్నిల్ ఊళ్లో సిగ్నల్ రాకపోవడంతో ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ టెస్ట్ సిద్దమవుతున్న యువ విద్యార్థిని సోదరుడితో 2 కి.మీ ల దూరంలోని కొండపైకి వెళ్లి చదువుకుంటున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడే చిన్నగుడిసె వేసుకున్న ఫొటోలు కూడా సోనూ సూద్ దృష్టికి వెళ్లడంతో సహాయం అంధించేందుకు ముందుకు వచ్చాడు. చదువుకోసం ఆ అమ్మాయి పడుతున్న కష్టాన్ని చూసి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నాడు. వాళ్ల ఊరికి వైఫై సౌకర్యం కల్పిస్తానని వివరణ ఇచ్చారు. దీంతో మరోసారి సోనూ సూద్ చేసిన సహయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు అందుతున్నాయి.