ఆ ఒక్క ఆభరణంతో అందనికే అందం.. స్టార్ హీరోయిన్స్ మసాలా లుక్స్

ప్రస్తుత కాలంలో అమ్మయిలు అందంగా కనిపించడానికి చెవి రింగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కాలం మారుతున్న కొద్దీ వాటి సైజ్ కూడా మారాయి. ఇక హీరోయిన్స్ దుస్తులలోనే కాకుండా ఆక్సిడైజ్డ్ డాంగ్లర్స్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టి వారి అందానికి మరింత అందాన్ని తెస్తున్నారు. ఇటీవల విద్యా బాలన్, స్వర భాస్కర్జ్ ఆహానా కుమ్రా కూడా అలాంటి ప్రయోగంతో నెటిజన్స్ ని ఆకర్షించారు.

ఒక చిన్న ఆభరణం ఎంత పెద్ద తేడాను కలిగిస్తుందో వీరిని చూస్తే క్లియర్ గా అర్ధమవుతోంది. కరెక్ట్ గా వేసుకున్న డ్రెస్ కి తగ్గట్టుగా రింగులు అమార్చుకోగలిగితే ఇలా ఉంటుంది. అహానా కుమ్రా ఒక అందమైన నీలం, గోధుమ రంగు చీరను ధరించి, అందులో నీలిరంగు స్టోన్ లో ఉన్న చెవిపోగులు ధరించారు. అవి చాలా కూల్ గా ఉన్నాయి. ఇక విద్యాబాలన్ తన తెల్లని పూల చీరలో ఒక అందమైన ఆక్సిడైజ్డ్ చెవిరింగులను కూడా ధరించింది. ఆమె చెవిపోగులు కూడా స్టోన్ కలర్ లో కలిపి ఉన్నాయి. చివరగా, స్వరా భాస్కర్ కూడా ఆమె ఆక్సిడైజ్డ్ రింగ్స్ తో తన గ్లామర్ డోస్ ని మరింత పెంచేసింది.