కోలీవుడ్ బ్యూటీ మీరా మిథున్ ఇటీవల కాలంలో అనేక రకాల వివాదాలు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట త్రిష తన అవకాశాలను లాగేసుకుందని ఆమె కోలీవుడ్ నెపోటిజమ్ కి మద్దతు ఇస్తోందని హాట్ కామెంట్స్ చేసింది. అనంతరం సూర్య, విజయ్ లాంటి హీరోలు అభిమానులను తనపైకి ఉసిగొలుపుతున్నారని ఇటీవల మరికొన్ని హాట్ కామెంట్స్ చేసింది. హీరోల ఫ్యామిలీలపై కూడా మీరా మిథున్ ఘాటుగా కామెంట్స్ చేసింది.
ఇక ఫైనల్ గా ఆ వివాదంపై సూర్య పరోక్షంగా మీరా మిథున్ కి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల దర్శకుడు భారతి రాజా ఒక్కడే మీరా మిథున్ విషయంలో అభిమానులకు మద్దతు ఇవ్వగా సూర్య ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ.. అభిమానులకు ఒక విషయాన్ని చెప్పారు. తక్కువ స్థాయి విమర్శల గురించి స్పందించి మన స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోవద్దని అంటూ మీ విలువైన సమయాన్ని మంచి పనులకు ఉపయోగించాలని అన్నారు. గతంలో కూడా సూర్య ఇదే విషయాన్ని అభిమానులకు చెప్పారు. ఆ మాటలను కూడా అభిమానులకు గుర్తు చేస్తూ.. గొప్ప పనుల కోసమే సమయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.