రెండవ సారి తల్లి కాబోతున్న కరీనా కపూర్.. తైమూర్ కి బిగ్ బ్రదర్ గా ప్రమోషన్!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ మరోసారి తల్లి కాబోతున్నట్లు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ గతంలో ఒకసారి ఇలాంటి రూమర్స్ వస్తే కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు మాత్రం మీరు విన్నది నిజమే అంటూ.. త్వరలోనే తమ కుమారుడు తైమూర్ అన్నయ్య కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

సైఫ్ అలీ ఖాన్ టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా కూడా తెలియజేసింది. ”మా కుటుంబంలో అదనంగా మరొకరు రాబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతున్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. తమ వారసుల శ్రేయస్సు కోసం మాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న మా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.” అని కరినా, సైఫ్ అలీ ఖాన్ తెలియజేసినట్లు PR టీమ్ తెలియజేసింది. ఇక ఇటీవల రణధీర్ కపూర్ కూడా ఈ విషయంపై స్పందించారు. “ఇది నిజమని నేను నమ్ముతున్నాను. అలా అయితే, నేను చాలా సంతోషంగా ఉంటాను. ఒకరికొకరు కంపెనీ ఇవ్వడానికి దోహ్ బచ్చే తోహ్ చాహియే.” అంటూ సరదాగా కామెంట్ చేయగా అది నిజమేనని సైఫ్ అలీ ఖాన్ టీమ్ అఫీషియల్ గా తెలియజేసింది.