మహేష్ ను వివాహం చేసుకోవడానికి నేను సంతోషంగా నా సినిమా కెరీర్ ని వదులుకున్నాను అంటూ నమ్రత శిరోద్కర్ చెప్పిన మాట ఓ వర్గం వారిని ఎంతగానో ఆకర్షించింది. మహేష్ బాబుపై ఆమెకు ఏ స్థాయిలో ప్రేమ ఉందొ ఆ ఒక్క మాటతో చెప్పేసింది. ఒక ఇంటర్వ్యూలో నమ్రత తన మ్యారేజ్ లైఫ్ గురించి ఈ విధంగా వివరణ ఇచ్చింది.
‘మొదటి స్థానంలో అగ్ర నటిగా ఉండాలనే కోరిక ఎప్పుడూ లేదు. మహేష్‌ను వివాహం చేసుకోవడానికి నేను సంతోషంగా నా వృత్తిని వదులుకున్నాను. అదృష్టవశాత్తూ, మా వివాహం జరిగిన 14 సంవత్సరాలలో ఒక్క క్షణం కూడా ఎలాంటి గొడవలు ఇబ్బందులు రాలేదు. ఇన్ని సంవత్సరాలు మేము కలిసి చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నాను అంటే నమ్మడం చాలా కష్టమని తెలుసు. కానీ అదే నిజమని నమ్రత వివరణ ఇచ్చారు.