Kollywood: కోలీవుడ్ మాస్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో అసురన్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ధనుస్ సరసన మలయాళీ సీనియర్ నటి మంజు వారియర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కి తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో ధనుష్ యువకుడిగా, మధ్య వయస్కుడిగా పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతో అలరించారు. పల్లెటూరి మొరట వ్యక్తిగా ఊరమాస్‌గా ధనుష్ అదరగొట్టేశాడు.. తలపాగా, పంచెకట్టులో మధ్య వయస్కుడిగా.. కోరమీసంతో ధనుష్ చేసిన మాస్ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి.. ఈ చిత్రంలో తన నటనకు సినీ ఇండస్ట్రీలో అసురన్ చిత్రం ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.
దీంతో ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయాలని దర్శక నిర్మాతలు చాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తెలుగులో రీమేక్ చేయనున్నట్లు విషయం తెలిసిందే. తెలుగులో నారప్పగా రీమేక్ అవుతుంది. ఈ చిత్రంలో నారప్పగా విక్టరీ వెంకటేశ్ నటిస్తున్నారు. కాగా నేడు 67వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా ధనుష్ అసురన్ చిత్రానికి గానూ అవార్డు దక్కించుకున్నాడు. అలాగే బాలీవుడ్ ఉత్తమ నటుడిగా భోంస్లే చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడు.