Bollywood: నేడు రాణీ ముఖ‌ర్జీ బ‌ర్త్‌డే.. కొత్త చిత్రం అనౌన్స్‌!

Bollywood: బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ రాణీ ముఖ‌ర్జీ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. ఈ చిత్రానికి మిస్సెస్ ఛ‌ట‌ర్జీ వ‌ర్సెస్ నార్వే అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌గా.. వాస్త‌వ క‌థ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతుందని వెల్ల‌డించింది చిత్ర‌బృందం.

Rani mukerji new movie

ఒక త‌ల్లి ‌సాగించిన పోరాటం నేప‌థ్యంలో సాగుతుంది. ఆషిమా ఛిబ్బ‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఎమ్మీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంచితే ఇక ఆమె ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం బంటీ ఔర్ బ‌బ్లీ-2.