హీరో నిఖిల్ సిద్ధార్థ్ క్లాప్ తో ‘పాటకు ప్రాణం’ ఘన ప్రారంభం

హెచ్.టీ సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై హేమల్ తుమ్మపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న తొలి చిత్రం ‘పాటకు ప్రాణం’ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది.

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సురేందర్ రెడ్డి, ప్రముఖ హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సంగీతానికి, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజికల్ ఫిల్మ్‌లో యువ నటులు సుదర్శన్, సాత్విక జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుందని దర్శక నిర్మాత హేమల్ తుమ్మపూడి తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో, సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం కార్యక్రమంలో,

దర్శకుడు హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ , “ముందుగా మా లాంటి యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో నిఖిల్ గారికి, దర్శకుడు సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా చిత్రబృందాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన నటీనటులందరికీ ధన్యవాదాలు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో తనికెళ్ల భరణి గారు, సుధర్శన్ గారు నటిస్తున్నారు. వీరితో పాటు రాజీవ్ కనకాల గారు, అనితా చౌదరి గారు, రఘు కారుమంచి గారు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుమారు 60 ఏళ్లుగా వెనుకబడిపోయిన రామయ్య అనే వ్యక్తి, అలాగే 20 ఏళ్ల యువకుడు కలిసి ప్రారంభించే మ్యూజికల్ జర్నీ చుట్టూ మా సినిమా కథ సాగుతుంది. ఇది న్యూ ఏజ్ మ్యూజికల్ డ్రామా. సినిమాలో చాలా పాటలు ఉంటాయి. మా చిత్రానికి శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మంచి తేదీని చూసుకుని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. మా ఈ ప్రయాణంలో ముందుకు సాగేందుకు మీడియా, ప్రేక్షకుల నుంచి ఇదే విధమైన సహకారం, ఆశీర్వాదాలు కొనసాగాలని కోరుకుంటున్నాను”.

తనికెళ్ల భరణి గారు మాట్లాడుతూ ,”“ఈ సినిమాపై ఎంతో ప్యాషన్‌తో, నమ్మకంతో పనిచేస్తున్న ఈ యువ దర్శకుడి కాన్ఫిడెన్స్ మీకు కూడా కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆయన ఎన్నారై అయినప్పటికీ, సినిమా చేయాలనే తపనతో ఈ ప్రాజెక్ట్‌ను చాలా అంకితభావంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు చాలా ఛాలెంజింగ్‌ స్క్రిప్ట్ ఉంది. ముఖ్యంగా పాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా సినిమాలో కథకు తగ్గట్టుగా పాటలు వస్తుంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం కథే పాటల చుట్టూ తిరుగుతుంది. గతంలో ఇలాంటి నేపథ్యంతో వచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ‘పాటకు ప్రాణం’ సినిమాను ‘శంకరాభరణం’తో పోల్చడం లేదు. అయితే ఆ సినిమాలో ఉన్న సంగీత స్ఫూర్తి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది.
ఈ చిత్రంలో ఒక పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ఈ తరం జెన్‌-Z సంగీతకారుడికి మధ్య ఉండే ఆసక్తికరమైన కలయికను చూపించబోతున్నారు. ఈ సినిమా దర్శకుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇలాంటి మంచి కథలు, సినిమాలు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశిస్తున్నాను.”

రాజీవ్ కనకాల గారు మాట్లాడుతూ ,”“భరణి గారు ఈ సినిమా గురించి చాలా చక్కగా వివరించారు. జెన్‌-జెడ్ ప్రేక్షకుల కోసం ఇలాంటి సినిమా తీసుకొస్తున్న దర్శకుడు హేమల్‌కు ముందుగా అభినందనలు.సినిమా విడుదలైన తర్వాత ఈ మ్యూజికల్ జర్నీ అందరినీ తప్పకుండా అలరిస్తుందని, స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. ఇక నా పాత్ర విషయానికి వస్తే.. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ సినిమా తర్వాత అనితా చౌదరి గారితో మరోసారి కలిసి నటిస్తున్నాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే ఈ సినిమాతో కూడా మా హిట్ కాంబినేషన్ కొనసాగుతుందని ఆశిస్తున్నాను. సుధర్శన్, దర్శకుడు హేమల్‌కు, అలాగే అందమైన హీరోయిన్ సాత్వికకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మమ్మల్ని ఆదరించి, ఈ సినిమాకు మీ సహకారం అందించాలని కోరుతున్నాను.”

అనితా చౌదరి గారు మాట్లాడుతూ ,”“ఈ యువ దర్శకుడు హేమల్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి హేమల్ నాకు ఫోన్‌లో కథ చెప్పినప్పుడే ఆయనలో ఉన్న అదే ఎనర్జీ, అదే నమ్మకం నాకు కనిపించింది. ప్రతిసారీ ఆయనతో మాట్లాడటం, ఈ సినిమా గురించి తెలుసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. తనికెళ్ల భరణి గారితో, రాజీవ్ కనకాల గారితో మరోసారి కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమాలో సుధర్శన్ తల్లిగా నటించే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మమ్మల్ని, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరినీ మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.”

హీరో సుధర్శన్ వంగల మాట్లాడుతూ ,”“మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన మీడియా మిత్రులందరికీ, ముఖ్య అతిథులుగా వచ్చిన నిఖిల్ గారికి, సురేందర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ సినిమాలో నేను అరుణ్ అనే పాత్రలో నటిస్తున్నాను. ఇంతమంది ప్రతిభావంతులైన నటీనటులతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శకుడు హేమల్ చాలా చిన్న వయసులోనే ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి మ్యూజికల్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి, మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు థియేటర్లలో ఒక అద్భుతమైన అనుభూతిని పొందేలా మంచి సినిమాను అందించగలమనే నమ్మకం మాకు ఉంది. మా సినిమాకు మీ అందరి ఆశీస్సులు, సహకారం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.”

హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ ,”“మా సినిమాకు మద్దతుగా వచ్చి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నేను రాధ పాత్రలో నటిస్తున్నాను. అరుణ్ జీవిత ప్రయాణంలో రాధ పాత్ర కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది.ఇంతమంది ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.”

నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి గారు మాట్లాడుతూ ,“మా కార్యక్రమానికి సమయం కేటాయించి విచ్చేసిన ముఖ్య అతిథులు నిఖిల్ గారికి, సురేందర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాజీవ్ కనకాల గారు, తనికెళ్ల భరణి గారు, అనితా చౌదరి గారు అందించిన సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా సినిమాకు మీ అందరి సహకారం, ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.”

డీఓపీ సంజీత్ సింగ్ మాట్లాడుతూ, ““అందరికీ నమస్కారం. ‘పాటకు ప్రాణం’ సినిమాలో పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హేమల్ గారికి ముందుగా నా ధన్యవాదాలు.హేమల్ గారికి సినిమా క్రాఫ్ట్‌పై మంచి పట్టు ఉంది. ప్రతి షాట్‌కు ఉన్న ప్రాధాన్యతను ఆయన అర్థం చేసుకుంటారు. కథకు ఏది అవసరమో, ఏది అవసరం లేదో తెలుసుకుని, సినిమాను చాలా ఎఫిషియెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా పాటలను చిత్రీకరించే విషయంలో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలను చూపించబోతున్నాం. ఈ అద్భుతమైన నటీనటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”

ఎడిటర్ ప్రభాత్ రెడ్డి మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. హేమల్‌తోనే నా ఫిల్మ్ మేకింగ్ జర్నీ కూడా ప్రారంభమైంది. హేమల్ నాకు చాలా సన్నిహితమైన స్నేహితుడు. మేమిద్దరం కాలేజీ రోజుల్లో కలిసి మా మొదటి షార్ట్ ఫిల్మ్ చేశాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మరోసారి కలిసి ‘పాటకు ప్రాణం’ సినిమాతో పనిచేస్తుండటం చాలా సంతోషంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది. మళ్లీ హేమల్‌తో కలిసి ఈ జర్నీలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది.”

నటీ నటులు: సుదర్శన్, సాత్విక,తనికెళ్ల భరణి,రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు.

సాంకేతిక వర్గం :

రచన & దర్శకత్వం: హేమల్ తుమ్మపూడి
నిర్మాతలు: శ్రీరామ్ తుమ్మపూడి, హేమల్ తుమ్మపూడి
కో-ప్రొడ్యూసర్: సి.ఆర్. చక్రవర్తి
ఛాయాగ్రహణం: సంజీత్ సింగ్
కూర్పు: ప్రభాత్ రెడ్డి బండ
సంగీతం: శేఖర్ చంద్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబీ రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అక్కినేని శ్రీనివాస రావు
పీఅర్ఓ : దినేష్ కోయ

Related Articles

Latest Articles