
పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణు గోపాల్ రెడ్డి తొలి రచన దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతర సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రోమాంచకం. వాసుకి వైభవ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి పవన్ కుమార్ పప్పుల సినిమాటోగ్రఫీ చేయగా చాణక్య రెడ్డి ఎడిటింగ్ చేశారు. ఉపేంద్ర లిమయే కీలకపాత్ర పోషించగా వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మనీ ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్రాలు ఈ విషయాన్నికి వస్తే…
కథ :
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన ఫ్రెండ్స్‌తో కలిసి స్టార్టప్ బిజినెస్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా అమ్మాయిలు, అబ్బాయిలను పరిచయం చేసే ‘రోమాంచకం’ అనే డేటింగ్ యాప్‌ను రూపొందించాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో ఆ యాప్ ద్వారా చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక) అతడికి పరిచయం అవుతుంది. మొదట సాధారణ పరిచయంగా మొదలైన వీరి సంబంధం క్రమంగా మరింత దగ్గరవుతుంది. మైథిలికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆమె పుట్టినరోజున చెన్నైకి వెళ్తాడు అన్వేష్. అయితే, కలుస్తానని చెప్పిన మైథిలి ఆ తర్వాత అతడిని బ్లాక్ చేస్తుంది. అలా దాదాపు మూడు నెలల పాటు అన్వేష్‌కు దూరంగా ఉంటుంది. అనుకోకుండా మూడు నెలల తర్వాత మళ్లీ అన్వేష్‌కు ఫోన్ చేసిన మైథిలి.. తాను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి అతడిని కలుస్తుంది. ఆమె కోసం అన్వేష్ ఓ ఫ్లాట్‌ను కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే, ఆ ఫ్లాట్‌కు వచ్చిన తర్వాత మైథిలి కనిపించకుండా పోతుంది. అసలు మైథిలి ఎందుకు హైదరాబాద్‌కు వచ్చింది? ఆమె ఎక్కడికి వెళ్లిపోయింది? ఆమెను వెతికే క్రమంలో అన్వేష్, అతని స్నేహితులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అసలు మైథిలి కనిపిస్తుందా లేదా? లేక ఊహించని మలుపు తిరుగుతుందా? అనేది తెలుసుకోవాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
సుమంత్ పక్కింటి అబ్బాయిలానే చాలా సహజంగా కనిపిస్తారు. అనంతిక ఉన్నంత వరకు తెరపై ఓ ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో ఫ్రెండ్స్ గ్యాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. అందులోనూ నరేంద్ర కనిపించే తీరు, అతని డైలాగ్ డెలివరీ నవ్వులు పూయిస్తుంది. మిగిలిన వారంతా కూడా బాగానే నవ్విస్తారు. పోలీస్ ఆఫీసర్‌గా ఉపేంద్ర లిమాయే ఉన్నంత వరకు నవ్వించే ప్రయత్నం చేస్తాడు. మిగిలిన పాత్రలు తమ పాత్ర పరిధిలో బాగానే చేశారు.
సాంకేతిక విశ్లేషణ :
వేణుగోపాల్ రెడ్డి రాసుకున్న కథ అంతా బలంగా లేనప్పటికీ దానిని హాస్యంతో జోడించి ప్రేక్షకులను థియేటర్లో నవ్విస్తూ ముందుకు సాగే ప్రయాణం చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాటోగ్రఫీ, సంగీతం, పాటలు బాగున్నాయి. హీరో హీరోయిన్ యొక్క కాస్ట్యూమ్స్ గురించి యువత ప్రత్యేకంగా ఆకర్షింపబడుతున్నారు. సాంకేతిక పరంగా సినిమా చాలా బలంగా అనిపిస్తుంది. నిర్మాణవులు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన, కామెడీ, పాటలు, సినిమాలో ఉత్కంఠ
మైనస్ పాయింట్స్ :
కథ, కొన్ని సన్నివేశాలు
సారాంశం :
ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబ సమేతంగా వచ్చి నవ్వుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసే చిత్రం రోమాంచకం.


