
యాక్షన్, ఎమోషన్ అంశాలతో తెరకెక్కుతున్న ‘గర్జించే పోలీస్’ చిత్రంలోని సాంగ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొని పాటను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సాయి వెంకట్ మాట్లాడుతూ… “గర్జించే పోలీస్ సినిమాలోని పాటలు చాలా సూపర్‌గా ఉన్నాయి. సాంగ్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్షలు” అన్నారు.
దర్శకుడు టి. రాము మాట్లాడుతూ… “గర్జించే పోలీస్ సాంగ్ లాంచ్ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. సినిమా విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్, ఎమోషన్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నాం. పాటలకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాను” అన్నారు.
నిర్మాత రామశర్మ మాట్లాడుతూ… “గర్జించే పోలీస్ సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. దర్శకుడు టి. రాము సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. పాటలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు. ఈ సినిమాని త్వరలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
హీరోయిన్ మాట్లాడుతూ… “గర్జించే పోలీస్ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. చిత్ర బృందం ఎంతో కష్టపడి సినిమాను రూపొందిస్తోంది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
‘గర్జించే పోలీస్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. పోలీస్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో ప్రేక్షకులను అలరించనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చందా లక్ష్మీనారాయణ నాయక్, మళ్ళెంవేణుమాధవ్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక బృందం :
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: టి. రాము
నిర్మాత:రామశర్మ
కెమెరా: సర్వేపల్లి వెంకన్న,
సంగీతం: అనిల్‌కుమార్ (చెన్నై)
ఎడిటింగ్: వేణు చౌదరి
ఫైట్స్: శివలింగం
డబ్బింగ్ ఇంజనీర్:కిందిబావి వెంకటేష్
నిర్మాణ నిర్వహణ: చందా రోజారాణి, లక్ష్మీనారాయణ నాయుక్
సహకారం: నరసింహకుమార్, భోగి కైలాసం, ధర్మశేఖర్


