ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదగా ‘సీక్రెట్ సోల్జర్’ ట్రైలర్ లాంచ్

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. సూర్య శ్రీనివాస్ ‘హిట్ 3’ సినిమా సమయంలో ఈ సినిమా గురించి చెబుతూ ఉండేవారు. నాకు ఈ ట్రైలర్ చాలా నచ్చింది. ట్రైలర్‌లో కష్టం కనిపించింది. చాలా కష్టపడి సినిమాను తీశారు అనే ఫీలింగ్ ట్రైలర్ కలిగించింది. ఇదే క్వాలిటీ సినిమాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు. అద్భుతమైన రైటింగ్‌తో తీస్తే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఆడియన్స్ చూస్తారు. నిహాల్ చాలా ఇంటెన్సిటీతో కనిపించాడు. శ్రీనివాస్ నాకు ‘హిట్ 3’ సినిమా నుంచి తెలుసు. ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. ఇద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చేశారని అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు వాళ్లను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 18న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఇది బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమా. డైరెక్టర్ విశ్వనాథ్ గారికి కంగ్రాచులేషన్స్. ఆల్ ది వెరీ బెస్ట్.

రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ సినిమా సెన్సార్‌లోనే 8 నెలల పాటు ఉందని విన్నాను. కచ్చితంగా అందరికీ నచ్చడం వల్లే సెన్సార్ నుంచి బయటకు వచ్చింది. నిర్మాత ఈ సినిమాకి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి తీశారు. సినిమాపై చాలా ప్యాషన్ ఉంది ఆయనకి. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయన మరో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. కాలభైరవ మ్యూజిక్ చాలా బాగుంది. చాలా మంచి స్ట్రాంగ్ టీమ్‌తో వస్తున్నారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

శాన్వి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నిహాల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సినిమా కథ నాకు తెలుసు. ఇందులో చాలా బలమైన ఎమోషన్ ఉంది. ఫ్రెండ్షిప్ ఉంది. అది నాకు చాలా నచ్చింది. నిహాల్ ఎవరో సినిమా వచ్చినప్పుడు చాలా మంచి పెర్ఫార్మర్ అని తెలుసు. కష్టాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నిహాల్ తెలుగు సినిమా ముద్దుబిడ్డ. తప్పకుండా ఈ సినిమాతో తనకి మరింత మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరో నిహాల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శాన్వి మా ప్రాజెక్ట్‌ను చాలా సపోర్ట్ చేసింది. తన అదృష్టం మాకు కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాను.బీవీఎస్ రవి గారు, శైలేష్ కొలను గారు వచ్చి సపోర్ట్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా పెద్ద పార్టీ ఇస్తాను. ఒకవేళ ఫ్లాప్ అయితే పంజాగుట్ట సెంటర్‌లో ఆటో ఎక్కి ఇంటికి వెళ్లి రెండు రోజులు ఏడ్చి, మరొక సినిమా పనిలో పడిపోతాను(నవ్వుతూ) “సినిమాని అందరూ చిన్న సినిమా అంటున్నారు. కాకపోతే ఇది ఎంత పెద్ద సినిమా అనేది మీకు చెప్తాను. ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు వెళ్లిన సినిమాల్లో ‘దురంధర్’, సల్మాన్ ఖాన్ సినిమా, మూడోది మా సినిమా. అంత పెద్ద సినిమా ఇది. మా సినిమాలో ఉన్న ఐడియా, ఎఫర్ట్, విజువల్‌ను చూడండి. చాలా అద్భుతమైన సినిమా తీశాం. సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ నచ్చితే మీరందరికీ షేర్ చేయండి. అందరూ సెప్టెంబర్ 18న థియేటర్స్‌కు వస్తారని కోరుకుంటున్నాను.

కమల్ కామరాజు మాట్లాడుతూ.. “డైరెక్టర్ గారు కథ  చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజ్‌గా అనిపించింది. చాలా పెద్ద స్కేల్‌లో తీసే కథ ఇది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడితే కొత్త ప్రొడ్యూసర్స్‌కు, డైరెక్టర్స్‌కు హోప్ వస్తుంది. సినిమాని ఎంజాయ్ చేయండి.

సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇంతకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు చాలా మంచి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చాలా మంచి కథ ఉన్న సినిమా అనిపించింది. ఈ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ధైర్యానికి అసలు అర్థం తెలిసింది. అలా పృథ్వి క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో యాక్షన్, హ్యూమర్ అన్నిటికంటే మించి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఈ సినిమాని గట్టిగా నిలబెడుతుంది.

డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా చాలా లాంగ్ జర్నీ. అలాగే చాలా ఎక్సైటింగ్‌గా కూడా అనిపించింది. ఒక ఛాలెంజింగ్‌గా కూడా అనిపించింది. మాకు  సపోర్ట్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ శైలేష్ కొలను గారికి, బీవీఎస్ రవి గారికి థ్యాంక్యూ. శాన్వి మా ప్రాజెక్ట్‌కి చాలా సపోర్ట్ చేసింది. నిహాల్, సూర్య, హర్షిత అందరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అందరూ కూడా చాలా అనుభవం ఉన్న యాక్టర్స్‌లాగా నటించారు. మేము చాలా గర్వపడే సినిమా తీశాము. టెక్నికల్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన క్వాలిటీతో తీశాం. ఇది తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

దీక్షా పంత్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్యూ. చాలా అద్భుతమైన కథతో వస్తున్న సినిమా ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

హర్షిత మాట్లాడుతూ.. మా టీజర్, ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో చాలా కొత్త రకం క్యారెక్టర్ చేశాను. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది.

శ్రీష మాట్లాడుతూ..  ఇందులో నా పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ పాత్రలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్యూ. మా టీమ్ అంతా చాలా కష్టపడి సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో టీం అందరూ పాల్గొన్నారు.

నటీనటులు: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం: అక్కి విశ్వనాధ రెడ్డి
బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
పీఆర్వో: తేజస్వీ సజ్జా

Related Articles

Latest Articles