సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అవసరాల శ్రీనివాస్ వీడియో

ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన స్నేహితుడైన ఒక యంగ్ హీరో గురించి అవసరాల శ్రీనివాస్ ఈ వీడియోలో చెప్పిన వివరాలు నెటిజన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఆ యంగ్ హీరో ఈ మధ్య స్లీప్ వాకింగ్ చేస్తూ అర్థరాత్రి హైదరాబాద్ రోడ్లపై జాంబీలా తిరుగుతున్నాడని ఆయన ఈ వీడియోలో తెలిపారు. ఆ హీరో మీకు అర్థరాత్రి నిద్రలో నడుస్తూ కనిపిస్తే భయపడకండని అవసరాల శ్రీనివాస్ సూచించారు. ఆయన వీడియోలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ హీరో ముందు నుంచి స్లీప్ వాకింగ్ చేస్తూ వెళ్లడం విశేషం. ఆ హీరో ఎవరో మీరు ఊహించగలిగితే సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ పంపండి అంటూ అవసరాల శ్రీనివాస్ కోరారు.

అవసరాల శ్రీనివాస్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. నిద్రలో నడిచే జబ్బు ఉన్న ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి, ఈ స్లీప్ వాకింగ్ వల్ల సదరు హీరో సినిమాలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి…వంటి వివరాలు అన్నీ ఈ నెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు మేకర్స్ రివీల్ చేయబోతున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం విశేషం.

Related Articles

Latest Articles