ఈ దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అల్లరించనున్న యామీ గౌతమ్ ‘నయ్యి నవెల్లి’

ఈ దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఆనందించేలా ఒక అద్భుతమైన ఫాంటసీ కామెడీ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు ప్రకటించాయి. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పేరు ‘నయ్యి నవెల్లి’.

ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 16 అక్టోబర్ 2026న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీరట్‌ నగరంలోని ఒక చలాకి కుటుంబంలోకి పెళ్లై కొత్తగా కోడలు అడుగుపెడుతుంది. ఆమె రాకతో ఆ ఇల్లు చాలా మంచి వాతావరణంలోకి మారుతుంది. అయితే ఎంతో పర్ఫెక్ట్ గా, ఆదర్శంగా కనిపిస్తున్న తన వదిన నిజానికి ఒక మాంత్రికురాలు ఏమో అని ఆమె మరిదికి అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి వింతలు జరిగాయి? ఎంతటి నవ్వుల హంగామా సృష్టించాయి? అన్నదే ఈ సినిమా కథ.

నిఖిల్ మధోక్, అమెజాన్ MGM స్టూడియోస్ ప్రతినిధి మాట్లాడుతూ… “ఈ సినిమా చూశాక, ఇది కచ్చితంగా దసరా పండుగకు సరైన చిత్రమని మాకు అర్థమైంది. వేరే ఏ తేదీ ఈ సినిమాకు న్యాయం చేయలేదు. యామీ గౌతమ్ అద్భుతంగా నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ దసరాకు ఇదే బెస్ట్ ఛాయిస్ అవుతుంది” అన్నారు.

నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ మాట్లాడుతూ… “నయ్యి నవెల్లి ప్రతి మలుపులో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. హాస్యం, ఫాంటసీ, అడ్వెంచర్ కలగలిపిన ఈ కథకు యామీ గౌతమ్ పర్ఫెక్ట్ ఛాయిస్. అమెజాన్ MGM స్టూడియోస్‌తో మా మొదటి కలయికలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని నమ్ముతున్నాము” అన్నారు.

కామెడీ, కన్ఫ్యూజన్, పండుగ లాంటి సంబరాలతో రాబోతున్న ‘నయ్యి నవెల్లి’ థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని ఇవ్వనుంది. ఈ అద్భుతమైన ఫ్యామిలీ ఫాంటసీని చిత్రం నయ్యి నవెల్లి దేశవ్యాప్తంగా 16 అక్టోబర్ 2026న విడుదల కానుంది.

Related Articles

Latest Articles