నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను: మేఘాంశ్ శ్రీహ‌రి

శ‌నివారం (ఆగ‌స్ట్ 15) స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి. ప్ర‌తీ ఏడాదిలాగానే ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇదే ప్రాంతంలోనే శ్రీహ‌రి కుమార్తె అక్ష‌ర స్మార‌క ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. ఈ మండ‌పంలోనే చెల్లి అక్ష‌రకు చెందిన స్మార‌కం కూడా ప‌క్క‌నే ఉంటుంది. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను. అంద‌రికీ విష్ యు హ్య‌పీ ఇండిపెండెన్స్ డే’’ అన్నారు.

శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు బావ‌(శ్రీహ‌రి) 62వ పుట్టిన‌రోజు. ఆయ‌న ఈరోజు మ‌న మ‌ధ్య లేక‌పోయినా ఎప్ప‌టికీ మ‌న హృద‌యంలోనే ఉంటాడు. అలాగే అంద‌రికీ సాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’’ అన్నారు.

Related Articles

Latest Articles