
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ “చెన్నై లవ్ స్టోరీ” సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు “చెన్నై లవ్ స్టోరీ” మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా గ్రాండ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకలు సందడిగా జరిపారు. ఈ సందర్భంగా
నటి సిరి హన్మంతు మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” మూవీలో నటించే అవకాశం దక్కడం హ్యాపీగా ఉంది. ఈ నెల 24న మీరంతా మా సినిమాతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నారు. ఇలాంటి మంచి మూవీలో భాగమయ్యే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న కిరణ్ గారికి హ్యాపీ బర్త్ చెబుతున్నా. మా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఏడాది అవుతోంది. ఇప్పటిదాకా మీరు ఆ గ్లింప్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మరో వారం


