చరిత్ర సృష్టించిన దళపతి : తెరపై హీరో.. నేడు తమిళనాడు ముఖ్యమంత్రి

చిత్తూరుకు చెందిన తాతగారు రామేశ్వరంలో స్థిరపడ్డారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడే జోసెఫ్ విజయ్. క్రైస్తవ, హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ పెరిగిన ఆయన, తన మతం ‘మానవత్వం’ అని సగర్వంగా ప్రకటించుకున్నారు.

సినీ ఇండస్ట్రీలో తన తండ్రి ఎదుర్కొన్న వివక్షను చూసి కసి పెంచుకున్న విజయ్, ఎన్నో అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. మొత్తం 68 సినిమాల్లో నటించి, స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

చిన్నతనంలోనే అనారోగ్యంతో చెల్లెలిని కోల్పోవడం విజయ్‌ని తీవ్రంగా కలచివేసింది. ఆమె జ్ఞాపకార్థం తన కార్ల నంబర్లు 0227 ఉండేలా చూసుకుంటారు. తన వీరాభిమాని సంగీతను ఆయన వివాహం చేసుకున్నారు. (ఇటీవల వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, భారీ భరణం అడిగారని వార్తలు వచ్చాయి).

2020లో తండ్రి తన పేరుతో పెట్టిన పార్టీని వ్యతిరేకించిన విజయ్, 2024లో స్వయంగా పార్టీ స్థాపించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో.. 2026 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ఊహించని విజయంతో ఇండస్ట్రీలోని ఉద్దండులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి దిగ్గజాల సరసన విజయ్ తన పేరు లిఖించుకున్నారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles