
అన్నయ్య, అగ్రశ్రేణి కథానాయకులు శ్రీ చిరంజీవి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగించింది. శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
పైడి జైరాజ్, బి ఎన్ రెడ్డి, నాగిరెడ్డి – చక్రపాణి, టీఎల్ కాంతారావు, రఘుపతి వెంకయ్య, సి నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు గార్ల పేరిట ఉన్న పురస్కారాలకు ఎంపికయిన శ్రీ కమల్ హసన్, శ్రీ సింగీతం శ్రీనివాస రావు, శ్రీ అశ్వినీదత్, శ్రీ ఆర్ నారాయణమూర్తి, శ్రీ రమేష్ ప్రసాద్, శ్రీ సుద్దాల అశోక్ తేజ, శ్రీ జయసుధ గార్లకి అభినందనలు. ఈ పురస్కారాలకు ఎంపికైనవారు చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు విలువైనవి. గద్దర్ పురస్కారాలకు ఎంపికైనవారికి అభినందనలు.


