
మెగాస్టార్ చిరంజీవి నటించిన పూర్తి కుటుంబ వినోదాత్మక చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’, బ్లాక్‌బస్టర్ హిట్ మేకర్ అనిల్ రవిపూడి దర్శకత్వంలో బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించింది. రీజనల్ సినిమా చరిత్రలో అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం, ప్రీమియర్ షోల నుంచే ఆధిపత్యం చూపించింది.
బుక్‌మైషోలో 24 గంటల్లో 488.32K టికెట్లు విక్రయమై, రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మొదటి రోజు వరల్డ్‌వైడ్ 84 కోట్లు+ గ్రాస్ సాధించి, చిరంజీవి ఆల్-టైమ్ హయ్యస్ట్ డే1 రికార్డ్ నెలకొల్పింది.
కుటుంబ ప్రేక్షకుల భారీ టర్నౌట్‌తో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఇది సంక్రాంతి సీజన్‌లో దీర్ఘకాలిక విజయానికి సూచిక. సోమవారం విడుదలైనప్పటికీ, సాధారణ నమ్మకాలను తిరగరాసి భారీ ఓపెనింగ్ సాధించింది. నేటి బుకింగ్‌లు కూడా అద్భుతంగా ఉన్నాయి.
నార్త్ అమెరికాలో $1.7M దాటి, $2M వైపు దూసుకుపోతోంది, ఇది చిరంజీవి హయ్యస్ట్ గ్రాసర్. సంక్రాంతి హాలిడేలతో మరింత బ్లాక్‌బస్టర్ రన్ ఖాయం.


