రామ్ పోతినేని “ఆంధ్ర కింగ్ తాలూకా” నార్త్ అమెరికాలో రికార్డ్ ఓపెనింగ్

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన హైప్ సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు పి డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మొదటి ప్రదర్శనల నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

మధ్యాహ్నం నుంచి ఫుట్‌ఫాల్స్ పెరిగి, ఈవెనింగ్, నైట్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. వీక్‌డే విడుదలకు ఇది అద్భుతమైన రెస్పాన్స్. బుక్ మై షోలో ట్రెండింగ్ అవుతున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా సత్తా చాటింది. నార్త్ అమెరికాలో మొదటి రోజు 275K+ గ్రాస్ సాధించి, రామ్ పోతినేని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ చేసింది.

రామ్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎమోషనల్ సెకండ్ హాఫ్, భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ, ఉపేంద్ర పాత్ర ప్రశంసలు పొందుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి కంటెంట్ రిచ్ సినిమాతో మెప్పించారు.

శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉండటంతో, లాంగ్ వీకెండ్‌లో మరిన్ని కలెక్షన్లు రాబోతున్నాయి. రామ్ కెరీర్‌లో మైలురాయి అవుతుందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా.

Related Articles

Latest Articles