‘చికిరి చికిరి’ 100 మిలియన్ వ్యూస్ సంచలనం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విడుదలైన వెంటనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో హోరెత్తించిన ఈ పాట, ఇటీవలి కాలంలో భారతీయ సినిమా ట్రాక్‌లలో అత్యంత వేగవంతమైన ప్రారంభాన్ని సాధించింది.

ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరసారథ్యంలో రూపొందిన ఈ పాట, ఖండాంతరాలు దాటి సాంస్కృతిక, భాషా సరిహద్దులను అధిగమించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాని ఆకర్షణీయమైన బీట్స్, జానపద శైలి పల్స్, సినిమాటిక్ సౌండ్‌స్కేప్‌లు ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను మంత్రముగ్ధులను చేసి, అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

తెలుగు వెర్షన్ 64 మిలియన్ల వ్యూస్, దాదాపు 1 మిలియన్ లైక్‌లతో ముందుంది. హిందీ వెర్షన్ 25 మిలియన్లు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు కలిపి మరో 10 మిలియన్లు సాధించాయి. రామ్ చరణ్ ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్‌లు, మాగ్నెటిక్ ప్రెజెన్స్ పాటను మరింత హైలైట్ చేశాయి. సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్, ఫ్యాన్ ట్రిబ్యూట్స్‌తో ఉర్రూతలూగుతోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. ఈ మొదటి సింగిల్ గ్లోబల్ చార్ట్‌బస్టర్‌గా మారడంతో చిత్రం మరింత ఉత్సాహాన్ని పుంజుకుంది, వచ్చే ఏడాది అత్యంత ఆసక్తికరమైన రిలీజ్‌గా నిలవనుంది.

Related Articles

Latest Articles