“రాజు వెడ్స్ రాంబాయి” చిత్ర రివ్యూ

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాగా డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ చేయగా నరేష్ అడపా ఎడిటింగ్ చేశారు. ఇక ఈ చిత్రా రివ్యూ విషయానికొస్తే…

కథ :

2010 సమయంలో తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలోని యదార్ధ సంఘటనను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నమే ఈ చిత్రం. రాజు, రాంబాయి ఒక గ్రామంలోని ప్రేమికులు. అయితే రాం బాయ్ తండ్రి వెంకన్న తన కూతురును ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేస్తానని బలంగా కంకణం కట్టుకుని ఉండగా రాజు డబ్బులు పెట్టుకుని ఒక వ్యక్తి కావడంతో అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిరాకరిస్తారు. అయినప్పటికీ ఆ జంట ఇద్దరు ఎంతో బలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే చివరికి ఈ జంట గెలుస్తారా లేక వెంకన్న పంతంతో వారిద్దరిని విడగొడతారా? చివరికి వారి పెళ్లి అవుతుందా లేదా? వారి ప్రయాణంలో ఎటువంటి మార్పులు వస్తాయి? యదార్థ సంఘటనలు తీసుకుని చేసిన సినిమా కాబట్టి ఏమైనా సినిమాటిక్ గా ఉంటాయా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటుల నటన :

అఖిల్ (రాజు) తొలి చిత్రం అయినప్పటికీ గతంలో అతను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం చూసాము. తన పాత్రకు తగ్గట్లు ఒక పల్లెటూరి యువకుడి లాగా డబ్బులు కొట్టుకుంటూ ఒక పిచ్చి ప్రేమికుడు నటనను చూపించడంలో తొలిచిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ రాకుండా ఎంతో బాగా నటించారు. తేజస్విని (రాంబాయి) గతంలో కమిటీ కుర్రాళ్ళు చిత్రంలో నటించినప్పటికీ ఈ చిత్రంతో ఎంతో గొప్ప గుర్తింపు వస్తుంది. పల్లెటూరి అమ్మాయిలాగా అమాయకత్వంతో కూడిన నటనను అద్భుతంగా పెర్ఫాం తీసి చూపించారు. చైతు జొన్నలగడ్డ (వెంకన్న) పిల్లల పాత్రలో తనదైన మార్కును ఈ చిత్రంలో వేసుకున్నారు. ప్రేక్షకులు అందరూ ఆయనకు నటనకు ముగ్ధుల్ని చేశారు. గతంలో కొన్ని చిత్రాలలో వివిధ పాత్రలు పోషించినప్పటికీ ఈ చిత్రంలోని ఆయన పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ నిలిచిపోయేంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అలాగే ఈ చతంలో ఇతర పాత్రలో నటించిన అనిత చౌదరి, శివాజీ రాజా తదితరులు తమ పాత్రల పరిధిలో తమ నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :

యదార్థ సంఘటనను చిత్రం రూపంలో దాల్చి ఒక కథగా రాసుకుని దానిని వెండితెరపై తీసుకురావడంలో దర్శకుడు సాయిలు విజయం సాధించారు. సినిమాలోని పాటలు ఇంకా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోశాయి. రెండవ భాగం కొంచెం స్లోగా ఉంది అనిపించినప్పటికీ ఎమోషన్స్ అద్భుతంగా పండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మరింత బాగా కనెక్ట్ అయ్యారు. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపించింది. లొకేషన్స్ అంతా నిజమైన తెలంగాణ మారుమూల ప్రాంతాలు కావడంతో తెలంగాణలోని పచ్చని ప్రదేశాలు ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. విజువల్స్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలు చాలా బావున్నాయి. నిర్మాణ విలువలు అద్భుతంగా వచ్చాయి.

ప్లస్ పాయింట్స్ : కథ, దర్శకత్వం, నటీనటుల నటన, సంగీతం.

మైనస్ పాయింట్స్ : రెండవ భాగం స్లోగా ఉండటం.

సారాంశం :

15 సంవత్సరాలుగా దాచబడిన ఒక వాస్తవిక సంఘటనను ప్రజలందరికీ తెలియాలి అని సంకల్పంతో తీసిన “రాజు బెడ్స్ రాంబాయి” ఆటో సినిమా విధంగా కూడా ఎమోషన్స్ నుండి ప్రతి విషయం వరకు ప్రేక్షకులను తృప్తి పరుస్తూ వచ్చిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం.

Related Articles

Latest Articles