24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్‌తో “పెద్ది” ‘చికిరి చికిరి’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’లోని మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ పాట భారీ సంచలనం సృష్టిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరసారథ్యంలో బాలాజీ లిరిక్స్, మోహిత్ చౌహాన్ గానంతో రూపొందిన ఈ పాట, లయ, భావం, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ రగ్డ్ లుక్, జాన్వీ కపూర్ ఆకర్షణ, రియల్ లొకేషన్లలో ఎలాంటి AI లేదా VFX లేకుండా చిత్రీకరించిన విజువల్స్, హుక్ స్టెప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేవలం 24 గంటల్లో నాలుగు భాషల్లో 46 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్ చార్టుల్లో అగ్రస్థానం దక్కించుకుంది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్‌తో సౌత్ ఇండియా రికార్డు బద్దలు కొట్టింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, డ్యాన్స్ చాలెంజ్‌లతో టైమ్‌లైన్లు, ప్లేలిస్ట్‌లు నిండిపోయాయి.

దర్శకుడు బుచ్చిబాబు సానా మ్యూజికల్ విజన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై గ్రాండ్ స్కేల్‌లో నిర్మాణమవుతోంది. వరల్డ్‌వైడ్ రిలీజ్ మార్చి 27, 2026న.

Related Articles

Latest Articles