
నీరజ కోన రచన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కీర్తి ప్రసాద్ నిర్మాతలుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తెలుసు కదా. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్యపాత్రలో నటిస్తూ హర్ష చెముడు కీలకపాత్ర పోషించారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా జ్ఞాన శేఖర్ డిఓపిగా పని చేశారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
హీరో సిద్దు జొన్నలగడ్డ ఒక అనాధ కావడంతో తనకు ఒక పూర్తి కుటుంబం ఉండాలని ఆశ పడుతుంటారు. రాశిఖన్నాను పెళ్లి చేసుకున్న తనకు కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టకపోవడంతో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన శ్రీనిధి శెట్టి వారి జీవితానికి మరోసారి వస్తుంది. అయితే వారి జీవితాల్లోకి తిరిగి వచ్చిన శ్రీనిధి శెట్టి వల్ల వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? చివరికి వారికి పిల్లలు పుడతారా లేదా? ఈ మధ్యలో జరిగే సంఘటన వల్ల వారు ఎటువంటి సందర్భాలను ఎదుర్కొంటారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపి ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
వరుణ్ క్యారెక్టర్ లో సిద్దు జొన్నలగడ్డ అద్భుతమైన పర్ఫార్మన్స్ ఇచ్చారు. అటు డైలాగుల దగ్గర నుండి ఇటు నటన వరకు ప్రతి విషయంలోనూ తన ఇల్లు స్టైల్ మార్కును ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఎంతో జాగ్రత్తగా మరొక కొత్త సిద్దు జొన్నలగడ్డ కనిపించారు. రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరూ హీరోయిన్లు పోటాపోటీగా నటిస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. వారి వారి పాత్రలకు తగ్గట్లు ప్రతి శీను పండడంలో ఎంతో బలంగా తమదైన ముద్రణ వేసుకున్నారు. అదేవిధంగా హర్ష చెముడు పాత్ర సినిమాలో ఎంతో కీలక పాత్రల నిలిచిపోయింది. అటు నవ్విస్తూనే ఇటు తన పర్ఫార్మెన్స్ తో చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాడు. చిత్రంలోని ఇతర పాత్రలు తమ తమ పాత్రకు తగ్గట్లు నటిస్తూ తమ పరిధిలో తాము సినిమాకు బలానికి చేకూర్చాయి.
సాంకేతిక విశ్లేషణ :
తాను అనుకున్న కథను నీరజ కోన వెండితెరపై ప్రేక్షకులకు అర్థమయ్యేలా అలాగే అటు మగవారు, ఇటు ఆడవారు ఇద్దరు అంగీకరించేలా తీసుకురావడంలో పూర్తిగా విజయం సాధించారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. డిఓపి జ్ఞాన శేఖర్ యొక్క విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాగ్రౌండ్ అలాగే ఇతర సాంకేతిక విషయాలు చాలా బాగా వచ్చాయి. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంది అనిపించినప్పటికీ సినిమా ఓవరాల్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో మంచి విజయం సాధించింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే, నటీనటుల నటన, సంగీతం.
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడ కొంచెం స్లోగా ఉండటం.
సారాంశం :
సమాజంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఒక సమస్యను ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చూపించడంలో అలాగే సినిమా పరంగా ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడంలో తెలుసు కదా చిత్రం మంచి విజయం సాధించిందని చెప్పుకోవచ్చు.


