‘హే చికిత్తా’ చిత్ర రివ్యూ

ధనరాజ్ లెక్కల రచనా దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి కుషి, దేవీ ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అంజి మామ, బలగం సుజాత, యోధ, అజయ్ జబర్దస్త్ తదితరులు కీలకపాత్రలో పోషించిన చిత్రం హే చికిత్తా. చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించగా అంజి సినిమాటోగ్రఫీ చేశారు.

కథ :
వ్యవసాయం గొప్పతనం, ప్రేమ, కుటుంబ బంధాలను అందంగా మేళవిస్తూ తెరకెక్కిన ‘హే చికిత్తా’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే ప్రయత్నం చేసింది. దర్శకుడు ధనరాజ్ లెక్కల రైతు జీవితాన్ని నేటి యువతకు దగ్గర చేసేలా కమర్షియల్ అంశాలతో కథను చెప్పడం ఆకట్టుకుంటుంది.

నటీనటుల నటన :
హీరో అభినవ్ మణికంఠ తన సహజమైన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ, డాన్స్‌లలోనూ మంచి ఎనర్జీ చూపించాడు. హీరోయిన్ దివిజా ప్రభాకర్ గ్రామీణ యువతిగా చక్కగా ఒదిగిపోయి తన పాత్రకు న్యాయం చేసింది. హీరో స్నేహితుల పాత్రలు కూడా వినోదాన్ని పంచుతూ కథకు బలం చేకూర్చాయి.

సాంకేతిక విశ్లేషణ :
సినిమాకు చరణ్ అర్జున్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. పాటలు వినసొంపుగా ఉండటమే కాకుండా తెరపై కూడా అందంగా కనిపిస్తాయి. గరుడవేగ అంజి సినిమాటోగ్రఫీ పల్లె అందాలను ఎంతో సహజంగా చూపించింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు మంచి ప్లస్‌గా నిలిచాయి.

చిత్ర విశ్లేషణ :
ప్రేమకథతో పాటు రైతు ఆత్మగౌరవాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. కుటుంబంతో కలిసి చూసేలా దర్శకుడు సందేశాన్ని వినోదాత్మకంగా అందించే ప్రయత్నం చేశాడు.

ప్లస్ పాయింట్స్ :
సంగీతం, పాటలు, కథ.

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని స్లో సన్నివేశాలు.

సారాంశం :
”హే చికిత్తా’ చిత్ర రివ్యూ

‘హే చికిత్తా’ ప్రేమ, కుటుంబ విలువలు, రైతు జీవితంలోని గొప్పతనాన్ని అందంగా ఆవిష్కరించిన మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. గ్రామీణ కథలు, సందేశాత్మక చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘హే చికిత్తా’ ఒక మంచి ఎంపిక.

Related Articles

Latest Articles