
“నాకు దర్శకుడు హరీష్ శంకర్ గారు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించాలి అన్నారు. నేను కథ వినకుండానే ఉస్తాద్ సినిమాలో నటించేందుకు అంగీకరించను” అన్నారు నటి రాశి ఖన్నా. ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుసు కదా చిత్రంలో సిద్దు జొన్నలగడ్డతో జంటగా శ్రీనిధి శెట్టితో పాటు రాశి ఖన్నా నటించడం జరిగింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో ఆమె నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ముందుగా పవన్ కళ్యాణ్ గారి చిత్రంలో నటించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ చిత్ర కథను వినకుండానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. సెట్స్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసి స్టన్ అయిపోయాను. సెట్స్ కు వచ్చాక హరీష్ శంకర్ గారు నాకు సినిమా కథ చెప్పారు. ఆయన ఆరా ప్రత్యేకమైనది.
నేను ఊహలు గుసగుసలాడె చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆ చిత్ర షూటింగ్ జరుగుతుండగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వస్తుంది అని ఆ చిత్ర డైరెక్టర్ షూటింగ్ ఆపేసి ఆ ప్రసంగం చూస్తూ ఉండిపోయారు. నాకు ఆరోజు అర్ధం అయింది ఆయన ఫాలోయింగ్ & పవనిజం గురించి అన్నారు. అలాగే ఇంకా రాశి ఖన్నా రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరొక 7-8 రోజుల షూటింగ్ ఉందని తెలిపారు.


