
సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్ 100కు కాల్ చేసిన దుండగుడు ‘విజయ్ మరోసారి పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతా’ అని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు లొకేషన్‌ను ట్రేస్ చేస్తున్నారు. ఇటీవల కరూర్ విజయ్ పర్యటించగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే.


